RGV Vyuham : రామ్ గోపాల్ వర్మ వ్యూహం కి లైన్ క్లియర్!
RGV Vyuham : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘వ్యూహం’. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రయాణం ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇది వరకే చాలా వైరల్ అయ్యింది. సీఎం జగన్ ని పొగుడుతూ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ని వెక్కిరిస్తూ ఈ సినిమాని ఆయన తెరకెక్కించాడు. జగన్ కి సపోర్ట్ గా సినిమా తియ్యడం లో తప్పు లేదు.
కానీ అతన్ని లేపడానికి మిగిలిన ఇద్దరు వ్యక్తులను కించపరచాలని చూడడం రామ్ గోపాల్ వర్మ నీచమైన బుద్ధికి నిదర్శనం. ఇతనొక పిచ్చోడు, దేనికి పనికి రాని వెదవ, బూతు సినిమాలు తీసుకునే పోరంబోకు అని అర్థం చేసుకొని టీడీపీ, జనసేన వాళ్ళు ఇతగాడిని పట్టించుకోవడం మానేశారు. కానీ పిచ్చి పట్టిన కుక్క లాగా ఇతగాడు ప్రతీ రోజు తన సినిమాకి పబ్లిసిటీ కోసం నోటికి హద్దు అదుపు లేకుండా కామెంట్స్ చేస్తూ ఉంటాడు.
రామ్ గోపాల్ వర్మ పైశాచికానికి అడ్డుకట్ట వేస్తూ సెన్సార్ బోర్డు ఈ సినిమాని నిలిపి వేసింది. ఎందుకంటే పాపులర్ రాజకీయ నాయకుడు పేరుని అయినా, సినిమా సెలబ్రిటీ పేరుని అయినా బహిరంగంగా సినిమాల్లో ఉపయోగించి, వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే కార్యక్రమాలు చెయ్యడం నిషిద్ధం. ఇది రూల్స్ కి పూర్తిగా వ్యతిరేకం. అందుకే ఈ సినిమా విడుదల ని ఆపేసింది సెన్సార్ బోర్డు. దీంతో రామ్ గోపాల్ వర్మ హై కోర్టు లో దీనిపై పిటీషన్ వేసాడు. హై కోర్టు ఇప్పుడు ఎవరి ఆదీనం లో ఉందో తెలుసుకోలేనంత అమాయకులు కాదు జనాలు. ఇన్ని రోజులు నడిచిన ఈ కేసు, నేడు చివరి తీర్పు కి వచ్చింది. ఈ తీర్పు లో రామ్ గోపాల్ వర్మ తన ‘వ్యూహం’ సినిమాని విడుదల చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దీంతో రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాని థియేటర్స్ లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ నెల 16 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ , చంద్రబాబు తో పాటుగా, అసలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి ని కూడా ఉపయోగించాడు. ఇన్ని వివాదాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమా, థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి గొడవలు జరగబోతున్నాయో చూడాలి.