Actor Mouli : వర్ధమాన నటుడిపై జగన్ అభిమానుల అరాచకం.. చివరకు భయంభయంగా క్షమాపణలు..

Finally, a terrible apology..

actor mouli Finally said apology..

Actor Mouli : ఇటీవల కాలంలో సినిమాలు, రాజకీయం బాగా కలిసిపోతోంది. సినిమాల్లో పొలిటికల్ డైలాగులు, సెటైర్లు కూడా ఎక్కువైపోతున్నాయి. పార్టీలకతీతంగా ఇవి నడుస్తునే ఉన్నాయి. ఈ సెటైర్స్ ఏ పార్టీని, నేతనూ వదిలిపెట్టడం లేదు. అయితే ఫన్నీగా చేస్తే ఇబ్బంది లేదు కానీ ఉద్దేశ పూర్వంగా చేస్తే మాత్రం తప్పే. అయితే జనాలు కూడా మరీ ఇలాంటి సెటైర్స్ కు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని కూడా చెప్పవచ్చు. తాజాగా పాపం ఓ యువ నటుడు ఏదో ఫన్నీగా చెప్పిన విషయం చివరకు భయంభయంగా క్షమాపణలు చెప్పేవరకు వచ్చింది.

#90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. సగటు జీవుల జీవితాలను ఆ సిరీస్ ప్రతిబింబించడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సినిమాలోని యాక్టర్లకు ఎంతో పేరు వచ్చింది. లీడ్ రోల్ చేసినా శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ కు ఈ వెబ్ సిరీస్ గ్రాండ్ సక్సెస్ పునాది వేసిందనే చెప్పాలి. ఇక ఇందులో శివాజీ భార్య, కొడుకులు, కూతురి పాత్రధారులకు మంచిపేరు వచ్చింది.

శివాజీ పెద్ద కొడుకుగా నటించిన యువనటుడు మౌళిపై తాజాగా వైసీపీ బూతు మీడియా తమ గురి ఎక్కుపెట్టింది. ఆయన చేసిన పాపమల్లా..రాజధానిని మాయం చేయడం. స్టేజ్ ఎక్కితే నలుగుర్ని నవ్వించడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మౌళి. .ఇటీవల ఓ కార్యక్రమంలో ఏపీ క్యాపిటల్ చూసుకోండి కావాలంటే ఎక్కడ దొరకదంటూ, రాజధానిని మాయం చేశానని ఓ కామెడీ వీడియో చేశాడు. దీంతో ఆ వీడియోను టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకుని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాకు మౌళి ఒక్కసారిగా టార్గెట్ అయ్యాడు.

మౌళినే కాదు అతడి పేరెంట్స్ ను సైతం వదిలిపెట్టలేదు. ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం ప్రారంభించారు. దీంతో భయపడిపోయిన మౌళి సారీ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దని కోరారు. తాను ఓ జోక్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రజలను నవ్వించడమే తన గోల్ అని రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదన్నారు. తన వీడియో ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరాడు. అతడి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

TAGS