New Cars 2024 : 2024లో కొత్త మోడళ్లలో రానున్న 5 కార్లు ఏంటో తెలుసా?

5 new cars coming in 2024

5 new cars coming in 2024

New Cars 2024 : మన దేశంలో మారుతీ సుజుకీ, మహేంద్ర, టాటా మోటార్స్, హ్యుందాయ్ తో సహా పలు కంపెనీలు 2024లో కొత్త కార్లు విడుదల చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ర్టిక్ కార్లు కూడా రానున్నాయి. ఈ ఏడాది విడుదల చేసే ఐదు కార్ల గురించి తెలుసుకుందాం. మారుతి సుజుకీ ఎస్ యూవీ2024 అందుబాటులోకి వస్తోంది.

ఇది టయోటా 27పీఎల్ స్కేట్ బోర్ట్ ఫ్లాట్ ఫారమ్ లో ఆవిష్క్రతమైంది. మారుతి సుజుకి తన మొదటి మారుతి సుజుకి మొదటి ఈవీలో ఆదాస్ టెక్నాలజీ, ఫ్రేమ్ లెస్ రియర్ వ్యూ మిర్రర్, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి స్విఫ్ట్ మంచి మోడల్. దీని డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇంటీరియర్, టెక్నాలజీతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధర రూ. 6 లక్షలు ఉంటుంది. కంపెనీ దీన్ని 2024 మార్చి నాటికి విడుదల చేస్తుంది.

టాటా కర్వ్ కూపే డిజైన్ ఎస్ యూవీ. ఇది కంపెనీ కూపే ఎస్ యూవీ. ఆర్డీఆర్ 2024 జూన్ తరువాత దేశంలో అందుబాటులోకి రానుంది. హ్యుందాయ్ క్రెటా ఆధారిత ఎలక్ర్టిక్ ఎస్ యూవీ 2024 ఎండింగ్ లో లాంచ్ అయ్యే వీలుంది. ఈ కారు డిజైన్, స్టైల్ అప్ డేట్ చేయబడిన క్రెటా. ఇది ఎల్ జీ కెమికల్ నుంచి పొందిన బ్యాటరీ సాయంతో నడుస్తుంది.

మహేంద్ర థార్ 5 డోర్ వెర్షన్ కూడా బాగుంటుంది. సౌకర్యవంతంగా ఉంటుంది. రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. 2 లీటర్ల పెట్రోల్, 2.2 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. దీని ధర రూ.15 లక్షలు ఉంటుంది. దీన్ని మార్చి 2024లో ప్రారంభించనున్నారు. ఇలా కొత్త కార్లు మనకు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

TAGS