Bride Ride Bike : బైక్ మీద మండపానికి వచ్చిన పెళ్లి కూతురు
Bride Ride Bike : మనిషికి వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందట. అది ఎవరికి ఏ రకంగా ఉంటుందో తెలియదు. పిచ్చి చేష్టలకు అంతుండదు. వారు ఏదనుకుంటే అది చేయాల్సిందే. లేదంటే మొండికేయడం ఖాయం. సాధారణంగా పెళ్లవుతుందంటే పెళ్లి కూతురును కారులో తీసుకు రావడం సంప్రదాయం. కానీ ఇక్కడ పెళ్లి కూతురు కారు ఎక్కనంది. మోటార్ సైకిల్ మీద పెళ్లి మంటపానికి వస్తానని చెప్పింది.
బుల్లెట్ బండెక్కి వచ్చేత్తవా డుగ్గుడుగ్గు డుగ్గుడుగ్గని అంటూ ఏం చక్కా మోటార్ సైకిల్ పై దర్జాగా పెళ్లి మంటపానికి వచ్చేసింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. పెళ్లి కూతురేంటి మోటార్ సైకిల్ ఎక్కడమేమిటని షాక్ తిన్నా పెళ్లికొడుకు మాత్రం కాబోయే భార్య అభిరుచికి ఫిదా అయిపోయాడు. ఆమె నిర్ణయాన్ని అంగీకరించాడు. నాకు ఇలాంటివి ఇష్టమేనని చెప్పడం గమనార్హం.
ఇలా పెళ్లి కూతురు తనకు కాబోయే వరుడిని చేరుకునేందుకు బైక్ పై రావడంతో స్నేహితులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో లక్షల్లో లైకులు, షేర్లు రావడంతో అందరిలో సంతోషం కలిగింది. మొత్తానికి ఆమె చేసిన పని వైరల్ అయింది. సెలబ్రిటీల మాదిరి తన కోరికను బహిరంగంగా తీర్చుకుని తాననుకున్న పని చేసింది.
దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అభినవ సాహసి అంటూ పొగడుతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎవరిని లెక్క చేయకుండా బైక్ స్వారీ చేసిన ఆమె కోరికను చూసి తెగ ముచ్చట పడుతున్నారు. ఎవరి అభీష్టం మేరకు వారు ప్రవర్తించొచ్చు. కాసల్ చేసిన పనికి ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భారత వనిత తెగింపు అంటే ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.