Paper Leak: పేపర్ లీక్‌కు పాల్పడితే కోటి రూపాయల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష…

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అయింది.  ఈ మేరకు పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఆన్ ఫెయిర్ మీన్స్ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది.  పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రూ. కోటి వరకు జరిమాన పడుతుంది.

ఇందుకు  సంబంధించిన బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే వ్యవస్థీకృత ముఠాలు మాఫియా పై ఉక్కు పాదం పడనుంది. వారితో చేతు లు కలిపే ప్రభుత్వ అధికారులకు కూడా కఠిన శిక్షలు విధిస్తారు. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేం ద్రం తాజా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది.

TAGS