Sreeleela : ఆ హీరోయిన్ బిక్ష లేకుంటే శ్రీలీల అసలు హీరోయిన్ అయ్యేది కాదా?
Sreeleela : ఇండస్ట్రీ లో చేతినిండా అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న హీరోయిన్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజి గా నిలిచినప్పటికీ, సాంగ్స్ పరంగా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల కి వరుసగా ఆఫర్స్ రావడం మొదలైంది.
ఎప్పుడైతే ఆమె రవితేజ తో ‘ధమాకా’ సినిమా మొదలెట్టిందో అప్పటి నుండి ఈమె దశ మారిపోయింది. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ చేతిలో అరడజను ప్రాజెక్ట్స్ పెట్టుకుంది. కానీ అలా వచ్చిన ప్రతీ సినిమా ఒప్పుకోవడం వల్లే నేడు శ్రీలీల ఖాతాలో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తగులుతున్నాయని. ఇంకో రెండు ఫ్లాప్స్ పడితే ఆమె ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. నిజానికి ఆ ప్రమాదం కూడా లేకపోలేదు. డ్యాన్స్ పరంగా ఈమెని కొట్టే హీరోయిన్ ఎవ్వరూ లేరు కానీ, యాక్టింగ్ పరంగా మాత్రం ఈమె కంటే ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటిస్తారని చెప్పొచ్చు.
అయితే శ్రీలీల ఇంత దూరం రావడానికి కారణం ముమ్మాటికీ ఆమె అదృష్టం, అలాగే ఒక హీరోయిన్ త్యాగం అని చెప్పొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈమె హీరోయిన్ కాకముందు బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందులో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఇందులో ‘తూనీగ తూనీగ’ అనే పాట ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తో పాటుగా పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపుని దక్కించుకుంది. అయితే ఈమె తొలి సినిమా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ‘పెళ్లి సందడి’ చిత్రం అవ్వాల్సింది అట.
డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చెయ్యగానే కావ్య కళ్యాణ్ రామ్ ఇంట్లో అడిగారట. కానీ ఆమె తల్లితండ్రులు కావ్య కి సినీ రంగం మీద ఆసక్తి లేదని, సాఫ్ట్ వేర్ ఉద్యోగం చెయ్యాలని అనుకుంటుంది అని చెప్పారట. అలా చెప్పిన రెండేళ్లకు కావ్య కళ్యాణ్ రామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాఘవేంద్ర రావు ఆమెతో మాట్లాడుతూ నువ్వు సినిమాల్లోకి వస్తావని తెలిసి ఉంటే పెళ్లి సందడి లో నిన్ను తీసుకునేవాడిని కాదమ్మా, మీ అమ్మగారేమో నీకు ఆసక్తి లేదని చెప్పారు అని అడిగాడట.