Rashmika : నా కర్మ కాలి ఆ హీరోతో కలిసి నటించాల్సి వచ్చింది అంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్!
Rashmika : టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందన. ‘ఛలో’ చిత్రం తో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన రష్మిక మందన, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ హిట్ మీద హిట్ కొడుతూ ఎవరికీ అందనంత రేంజ్ కి వెళ్ళిపోయింది. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, ఈమెకి కన్నడ, తమిళ భాషల్లో కూడా భారీ హిట్స్ ఉన్నాయి.
రీసెంట్ గా రణబీర్ కపూర్ తో చేసిన ‘ఎనిమల్’ చిత్రం తో బాలీవుడ్ లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో అయితే ఆమె రణబీర్ కపూర్ ని డామినేట్ చేసేసింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
స్క్రిప్ట్ ఎంపిక విషయం లో ఎంతో కచ్చితంగా ఉండే రష్మిక మందన ఒక సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉందట. కథ విన్నప్పుడే ఆమెకి అసలు నచ్చలేదట, కానీ మొహమాటం కి చెయ్యాల్సి వచ్చిందట. ఆ సినిమా పేరు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శర్వానంద్ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా అప్పట్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘నేను చేసిన అన్నీ సినిమాలు, నా ఇష్టం మీదనే చేశాను. హిట్ అయినా ఫ్లాప్ అయినా అవి నాకు సంతృప్తిని కలిగించాయి. కానీ ఒక సినిమా మాత్రం ఇష్టం లేకపోనా చేశాను. అదే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం. శర్వానంద్ ప్రత్యేకంగా ఈ సినిమా చెయ్యమని రిక్వెస్ట్ చెయ్యడం వల్ల, నా మనసుకి కథ నచ్చకపోయినా చేసాను. రెమ్యూనరేషన్ కూడా వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకున్నాను, ఏమి డిమాండ్ చెయ్యలేదు’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇకపోతే రష్మిక ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు లో నటించబోతుంది. దీంతో పాటు ఆమె ‘పుష్ప ది రూల్’ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.