High Court : వ్యూహం సినిమా కు హైకోర్టులో దక్కని ఊరట
High Court : టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయాల నేపథ్యంలో వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా టిడిపి నాయకులు తెలంగాణ హైకోర్టు కేసు వేయడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం జనవరి 11 కి పోస్ట్ పోన్ అయ్యింది.
కానీ అప్పటికి కోర్టు నుంచి విడుదలకు అనుకూల తీర్పు రాకపోవడంతో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం మొదలైంది. అయితే వర్మ మాత్రం ఈ సినిమాను విడుదల చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులో మూవీ రిలీజ్ కోసం పోరాడుతున్నారు. అయితే ఎంత ఫైట్ చేస్తున్న ఆర్జీవికి మాత్రం అనుకూలంగా తీర్పు రావడం లేదు.
గతంలో వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో మళ్ళీ సెన్సార్ బోర్డు రివ్యూ చేసి కొత్త రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని కోరింది. అయితే వర్మ టీం సింగల్ బెంచ్ తిరిగిన సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. ఆ పీటీషన్ ను పరిశీలించిన న్యాయ మూర్తి కూడా సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సెన్సార్ బోర్డు ఈనెల 9 లోపు రిపోర్ట్ ఇవ్వాలని తీర్పు నిచ్చింది. దీంతో వర్మకు ఈ సారి కూడా అనుకూలంగా తీర్పు రాలేదు.