Klin Kara : రాంచరణ్ కూతురు క్లిన్ కారా కేర్ టేకర్ నెల జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Ram Charan Daughter Klin Kara : సౌత్ ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో రామ్ చరణ్ , ఉపాసన పేర్లు కచ్చితంగా ఉంటాయి. పెళ్ళై 12 ఏళ్ళు దాటినా ఈ జంట ని చూసి కొత్తగా పెళ్లి అయ్యే వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇద్దరు కలిసి ఏకాభిప్రాయం తో 11 ఏళ్ళు సంతానం వద్దు అని అనుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ అడ్డు చెప్పలేదు, రామ్ చరణ్ కూడా అందుకు ఒప్పుకున్నాడు.
బయట సమాజం ఎన్ని మాట్లాడుకున్నా పట్టించుకోలేదు. అదే వీళ్ళ స్థానం లో ఉన్న ఎంతో మంది సెలెబ్రిటీలు ఈ సమస్య కారణంగా విడాకులు తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ రామ్ చరణ్, ఉపాసన జంటలు అందుకు అతీతం. అయితే ఈమధ్యనే వీళ్లిద్దరికీ క్లిన్ కారా అనే పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ పాప పుట్టిన దగ్గర నుండి ఎంతో అపురూపంగా చూసుకుంటూ వస్తున్నారు రామ్ చరణ్, ఉపాసన.
అయితే రామ్ చరణ్, ఉపాసన ప్రస్తుతం ఉంటున్న వృత్తులు అంత సుళువైనవి కాదు. ఇద్దరికీ క్షణం తీరిక కూడా ఉండదు. రామ్ చరణ్ సినిమా షూటింగ్స్ తో బిజీ అయితే, ఉపాసన హాస్పిటల్ పనుల్లో బిజీ. ఇన్ని రోజులు క్లిన్ కారా కోసం హాస్పిటల్ కి పోకుండా తానే బాధ్యతలు మొత్తం దగ్గరుండి చూసుకునేది. కానీ ఇప్పుడు ఆమె కూడా బిజీ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే వీళ్లిద్దరు ఒక కేర్ టేకర్ ని రీసెంట్ గానే నియమించుకున్నారు. ఆమె పేరు సావిత్రమ్మ. ఈమె కరీనాకపూర్ పిల్లలకు గతం లో కేర్ టేకర్ గా పనిచేసింది. ఆమె ఇచ్చిన సలహాతోనే సావిత్రమ్మ ని నియమించుకున్నారు ఈ దంపతులిద్దరూ.
ఈమె నెల జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఈ రేంజ్ శాలరీ కి చేరుకోవాలంటే ఎన్నో ఏళ్ళు పనిచేయాలి. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె నెలకి రెండు లక్షల రూపాయిల వరకు పారితోషికం అందుకుంటుదట. అంతే కాదు ఆమె తినే ఫుడ్, పడుకునే స్థానం అన్నీ ఆమె కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారట. అంటే ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలు అన్నమాట. ఆ రేంజ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఈమె ఎంత మంచి కేర్ టేకర్ అనేది అర్థం అవుతుంది.