4th February Horoscope : నేటి రాశి ఫలాలు

4th February Horoscope

4th February Horoscope

4th February Horoscope : మేష రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. గోసేవ చేయడం మంచిది.

వ్రషభ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కొత్త పనులు చేపడతారు. మంచి ఆలోచనతో ముందుకు వెళతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభ ఫలితాలు కలిగిస్తుంది.

మిథున రాశి వారికి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఇష్టదేవతారాధన చేయడం ఉత్తమం.

కర్కాటక రాశి వారికి మీ అంచనాలు తప్పుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. సూర్యుడిని పూజించడం వల్ల లాభాలుంటాయి.

సింహ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్త వహించాలి. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. శ్రీరామరక్షా స్తోత్రం చదవడం శుభప్రదం.

కన్య రాశి వారికి ఇతరుల వల్ల మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

తుల రాశి వారికి ఒక శుభవార్త మనోబలం పెంచుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన మేలు కలిగిస్తుంది.

వ్రశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. కీలక పనులు పూర్తి చేసుకుంటారు. అనుకూల ఫలితాలు వస్తాయి. ఆంజనేయ స్వామి స్తోత్రం చదవడం మంచిది.

ధనస్సు రాశి వారికి ముఖ్య వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమతో మంచి ఫలితాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

మకర రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. సహనమే రక్షణగా నిలుస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం వల్ల అనుకూల ఫలితాలు ఇస్తుంది.

కుంభ రాశి వారికి శత్రువులపై విజయం మీదే. అధికారుల సహకారం లభిస్తుంది. పనులు పూర్తవుతాయి. ఇష్టదేవతారాధన శ్రేయస్కరం.

మీన రాశి వారికి మనసుకు బాధ కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలైన ఫలితాలు కలగజేస్తుంది.

TAGS