America: అమెరికా వెళ్లే భారతీయలకు షాక్ ఇచ్చిన బైడెన్..వీసా తో సహా ఇతర ధరల పెంపు!
అమెరికా కు వెళ్లే భారతీయులపై ఇక మరింత భారం పడనుంది. హెచ్-1 బీ వీసా సహా కోన్ని కేటగిరీల దరఖాస్తుల రుసుములను పెంచుతున్నట్లు అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఏఫ్రిల్ 1 వతేధి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. వీసాల అప్లికేషన్ ఫీజులను పెంచడం 2016 తర్వాత మళ్లీ ఇ ప్పు డేనని బైడెన్ సర్కార్ వెల్లడించింది.
తాజా నిర్ణయంతో హెచ్-1 బీ వీసా దరఖాన్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్ల వరకు పెరిగింది. హెచ్-1 బీ రిజిస్ట్రేషన్ ధరసను కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. అయితే ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను 3,675 డాలర్లు నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంలాండ్ సేక్యూరిటి తమ ఫెడరల్ నోటిఫికేషన్ లో పెర్కోంది.