HanuMan : 92 సంవత్సరాల సినీ చరిత్రలో ఆ రికార్డ్ సొంతం చేసుకున్నది హను-మాన్ మాత్రమే.. ఏంటా రికార్డు?

Only Hanu-Man holds that record in the 92-year history of cinema

Only Hanu-Man holds that record in the 92-year history of cinema

HanuMan Records : ఈ ఏడాది రిలీజై సంచలన విజయం సాధించిన సినిమా ‘హను-మాన్’. ఏకంగా స్టార్ హీరో మహేశ్ బాబు చేసిన గుంటూరు కారంను వెనక్కు నెట్టింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ హైఎస్ట్ కలెక్షన్లు సాధించని మూవీగా నిలిచింది. 92 సంవత్సరాల సినీ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ కవడం కష్టమేనని తెలుస్తోంది.

హను-మాన్ కు ఊహించని రేంజ్ లో బుకింగ్స్ జరుగూనే ఉన్నాయి. అద్భుతమైన టాక్ వస్తే చాలు రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్లు కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. హను-మాన్ రాబోయే రోజుల్లో కలెక్షన్ల పరంగా రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. హను-మాన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో పాఠాలు నేర్పింది.

ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కాంబోలో వచ్చిన ఈ మూవీకి ఇప్పటి వరకు ఏదీ పోటీలో లేదు. ఉంటే మరిన్ని రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హను-మాన్ కు హనుమంతుడి ఆశీస్సులు కూడా ఉన్నాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. హను-మాన్ కలెక్షన్ల విషయంలో కొత్త మార్క్ ను క్రియేట్ చేసింది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ భారీగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇతర భాషలపై కూడా వర్మ దృష్టి పెడితే రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉండేది. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్ సపోర్ట్ చేయడం మరింత ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.

TAGS