Tamballapalli Ramadevi : నందిగామ లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడనుందా..? రోజురోజుకి ఆదరణ పెంచుకుంటున్న రమాదేవి!
Tamballapalli Ramadevi : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజగవర్గం లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ కి ఈ ప్రాంతం కంచుకోట లాంటిది. పార్టీ ఏర్పడిన తర్వాత కేవలం రెండు సార్లు మాత్రమే ఇక్కడ ఓడిపోయింది. అయితే ఈసారి జనసేన పార్టీ తో కలిసి వెళ్తున్న సందర్భంగా ఈ స్థానం ని తంబళ్లపల్లి రమాదేవి కి కేటాయించినట్టు తెలుస్తుంది.
వేరే అభ్యర్థి ని ప్రకటించి ఉంటే టీడీపీ లోకల్ లీడర్స్ నుండి అస్సమ్మతి రగిలేదేమో కానీ, రమాదేవి పేరు తెరమీదకి రావడం తో టీడీపీ నాయకులు సైతం ఈ ప్రాంతం లో రమాదేవి కి మద్దత్తు గా నిలిచి ఆమెని గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గం లో ఆమెకి ఉన్న పేరు, పలుకుబడి తో పాటుగా ఆమె చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను గౌరవించి ఆమెకి సపోర్టుగా నిలిచేందుకు సిద్ధపడ్డారు.
ఇంతకీ రమాదేవి చరిత్ర ఏమిటి..?, ఎందుకు ఆమెకి నందిగామ లో రోజురోజుకి ఇంత ఆదరణ పెరుగుతూ పోతుంది?, టీడీపీ కి కంచుకోట లాంటి ఈ ప్రాంతం లో టీడీపీ అభ్యర్థిని పక్కన పెట్టి ఈమెకి కేటాయించడానికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రమాదేవి భర్త రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ తంబళ్లపల్లి రవికుమార్ మూర్తి. ఈయన డీఐజీ గా కూడా పని చేసి ఉన్నాడు. గత ఎన్నికలలో ఆయన కొవ్వూరు ప్రాంతం నుండి జనసేన పార్టీ తో పొత్తులో ఉన్న బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాడు.. ఆ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రమాదేవి, రవి కుమార్ మూర్తి జనసేన పార్టీ ఎదుగుదలకు అగర్నిసలు పనిచేసారు. ఈమె సేవలను గుర్తించి పవన్ కళ్యాణ్ టీడీపీ – జనసేన సమన్వయకర్త బాధ్యతలను అప్పగించాడు.
అంతే కాకుండా గడిచిన 5 ఏళ్లలో ఆమె పార్టీ కి సేవలు చేసిన విధానం, అలాగే జనాలతో మమేకమై జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లిన తీరుని గమనించి, ఆమెకి జనసేన పార్టీ తరుపున రాబొయ్యే ఎన్నికలలో ఎమ్మెల్యే సీటు ని ఇచ్చాడు. నందిగామ ప్రాంతం లో సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్ మోహనరావు అక్రమాలను, అతను చేస్తున్న ఇసుక మాఫియా దందాలను అడ్డుకోవడానికి రమాదేవి ఎంతో పోరాడింది. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంది. నిజమైన సేవ చెయ్యాలనే ఆమె గొప్ప మనసుని చూసి టీడీపీ నాయకులు కూడా ఆమెకి మద్దత్తు ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న సర్వేల లెక్కల ప్రకారం రమాదేవి ఈ స్థానం నుండి పోటీ చేస్తే 20 వేల ఓట్ల మెజారిటీ తో గెలుస్తుందని తెలుస్తుంది.