Khammam MP Seat : ఖమ్మం కోసం కాంగ్రెస్ లో ఫైట్! ఢిల్లీ నుంచి స్టేట్ లీడర్లను ఆకర్షిస్తున్న సీటు.. ఎవరికి దక్కేనో అంటూ పార్టీలో గుసగుసలు..
Khammam MP Seat : ఇంకా ఒకటి, రెండు నెల్లలో పార్లమెంట్ ఎన్నికలకు నాగారా మోగబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కూడా సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని అనుకుంటుంది. దీని కోసం ఎవరిని ఎక్కడి నుంచి నిలబెట్టాలని అంచనా వేస్తుంది. దీనిలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంపై రోజు రోజుకు పోటీ పెరుగుతోంది.
కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చే పార్లమెంట్ స్థానం ఖమ్మం. ఇక్కడ బీజేపీకి గానీ, బీఆర్ఎస్ కు గానీ పెద్దగా ప్రభావం లేదు. వన్ సైడ్ గా కాంగ్రెస్ కు ఖాతాలోకి వచ్చే సీటు ఇది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తే పార్లమెంట్ లో కూర్చోవచ్చని నాయకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినిని ఈ టికెట్ పై నిలబెట్టాలని భట్టి భావిస్తుండగా. ఆ టికెట్ తనదే అంటూ రేణుకా చౌదరి సంకేతాలు ఇస్తుంది. వీరితో పాటు మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ కూడా ఇదే టికెట్ కావాలని కోరుతున్నాడు.
అయితే, ఈ సీటు నుంచి పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీని నిలబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. దీనికి నాయకులు కూడా ఒకే చెప్పారు. అయితే భట్టి సతీమణిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదన తెచ్చాడని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ సోనియాగాంధీకి తమ ప్రతిపాదనను వినిపించారట. అయితే ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురి మధ్యే పోరు జరిగేలా కనిపిస్తుంది.