మా మధ్య నిజంగానే అలాంటి రిలేషన్ ఉంది అంటూ బర్రెలక్కతో పెళ్లిపై స్పందించిన పల్లవి ప్రశాంత్!

Barrelakka Marriage

Barrelakka Marriage News, Pallavi Prasanth

Barrelakka Marriage : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో బర్రెలక్క, పల్లవి ప్రశాంత్ కి పెళ్లి జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నెటిజెన్స్ ఈ విషయాన్నీ నిజమే అని నమ్మిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మీడియా లో కూడా వీళ్లిద్దరికీ నిజంగానే పెళ్లి జరుగుతుంది అని ప్రచారం అయ్యింది. విషయం బర్రెలక్క వరకు చేరడం తో ఆమె దీనిపై స్పందించింది.

ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని నేను అంతగా ఫాలో అవ్వను. ఈ వార్త నా వరకు చేరింది, కనీసం స్పందించాలని కూడా అనిపించలేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను పల్లవి ప్రశాంత్ ని అన్నయ్య ని పిలుస్తుంటా. అతనంటే నాకు చాలా గౌరవం ఉంది. ఒక సామాన్య మనిషిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ ని ఓడించి టైటిల్ ని గెలిచాడు. ఎంతో మంది సామాన్యులకు ఆదర్శం అయ్యాడు. ఆయనని నేను ఎప్పుడు ఒక్క అన్నలాగానే చూస్తాను కానీ, సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చింది బర్రెలక్క.

మరో పక్క ఈ రూమర్ పై పల్లవి ప్రశాంత్ కూడా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘బర్రెలక్క  శిరీష నాకు చెల్లెలు తో సమానం. ఆమెతో నాకు పెళ్లి చెయ్యాలని చూస్తుంది ఈ సోషల్ మీడియా. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా. మీ రేటింగ్స్ కోసం నోటికి వచ్చింది రాసేస్తారా..?, మీ రాతల వల్ల ఎదుటి వారి కుటుంబాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది చూసుకోరా?’ అంటూ పల్లవి ప్రశాంత్ స్పందించాడు. అంతే కాకుండా బర్రెలక్క గురించి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా వారింది.

ఆయన మాట్లాడుతూ ‘బర్రెలక్క కూడా నాలాగే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చింది. ఒక సామాన్యురాలి పేరు రాజకీయాల్లో మారుమోగింది. సామాన్యుల పవర్ ఏంటో చూపించింది. రానున్న రోజుల్లో ఆమె రాజకీయంగా ఎదిగేందుకు నా సాయం కోరితే తప్పకుండా ఒక అన్నయ్య లాగ చేసి పెడతాను’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరు పెళ్లి గురించి ఈ క్లారిటీ ఇవ్వడం తో, సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ప్రచారం అవుతున్న ఈ పెద్ద రూమర్ కి చెక్ పడింది.

TAGS