TG Venkatesh: పార్టీలకతీతంగా ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలి – మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పార్టీలకతీతంగా ఆర్యవైశ్యులు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో రాణించాలని మాజీ రాజ్యసభ సభ్యులు, ఆర్యవైశ్య మహాసభ జాతీయ నాయకులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నూతన అధ్యక్షునిగా భవ నాసి నాగ మహేష్ ప్రమాణస్వీకారం గురువారం నంద్యాల పట్టణం సౌజన్య కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీ వెంకటేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలకు, ఎస్సీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాయని, కానీ ఆర్యవైశ్యులను ఓసీలని చెప్పి రాజ్యాంగపరంగా ఎటువంటి హక్కులను కల్పించలేదన్నారు. ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారాలు చేసి పన్నులు కట్టే యంత్రాల్లా ఈ ప్రభుత్వాలు చూస్తున్నా యని, అందుకే ఆర్యవైశ్య సంఘాల ద్వారా పేద ఆర్యవై శ్యులను ఆదుకునేందుకు ఇదొక సదవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు అన్ని పార్టీల్లో ఉండాల్సిందేనని వారి స్థాయిని బట్టి వారు రాజకీయంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ఆర్య వైశ్యులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టిజీ వెంకటేష్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆర్య వైశ్యులు సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. ఏపీ, తెలంగాణ ఆర్య వైశ్య సంఘం భవనాల ఏర్పాటుకు 2 కోట్లు ఇస్తానని టీజీ హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని, నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, నూతన కమిటీ ఆర్య వైశ్య పేదలకు సేవలు చేయాలని ఆయన పిలుపు నిచ్చా రు. ఆర్య వైశ్యులకు ఒక నిధిని ఏర్పాటు చేయాలని టీజీ డిమాండ్ చేశారు. వైశ్యులపైన దాడులు చేసిన వారికీ, ఈ జాతిని కించపరిచే వారికీ ఖాబర్ధార్ అని టీజీ హెచ్చరిం చా రు. ఐలయ్య ఆర్యవైశ్యులపైన కించపరి చేలా బుక్ రాశా రని, ఆ బుక్ ను ఉపసంహ రించేంత వరకు వెంటబ డ్డామన్నారు. ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా సత్య నారాయణను ఎంపిక చేశామని, మహాసభ ద్వారా మంచి భవనాలు కట్టి జాతీయ, రాష్ట్రస్థాయిలో ఆర్యవైశ్యులకు సేవలు చేసేందుకే ఆర్యవైశ్య మహాసభ అని ఇందులో రాజకీయాలకు తావు లేదని ఆయన పేర్కొన్నారు.
మహాసభ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాలలో రాజకీయంతో పాటు వ్యాపారవేత్తగా భవనాసి శ్రీరామమూర్తికి మంచి పేరు ఉందని ఆయన లాగానే ఆయన కొడుకు భవనాశి నాగ మహేష్ కూడా రాజకీ యం గా, సామాజికంగా సేవలు చేస్తూ ఎదగాలని నూతన అధ్యక్షున్ని ఆయన ఆశీర్వదించారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర అధ్యక్షులు చిన్న సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలివిది ప్రకాష్ రావు రాష్ట్ర నాయకులు షణ్ము గం పోతుల సురేష్ జయంతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.