Prabhas : సెకండుకి 80 లక్షల రూపాయిలు..చరిత్ర తిరగరాసిన ప్రభాస్!

80 lakh rupees per second..Prabhas history

80 lakh rupees per second..Prabhas history

Prabhas : ఇండియా లో రజినీకాంత్ మరియు ఖాన్స్ త్రయం కంటే ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన రేంజ్ ఎవ్వరూ అందుకొని స్థాయికి చేరుకుంది. ఆయన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా వస్తున్న ఓపెనింగ్స్ వసూళ్లు చూస్తూ ఉంటే ప్రభాస్ ని రీచ్ అయ్యే హీరో ఇండియా లో మరొకరు లేరు అని కూడా అనిపిస్తుంది. రజినీకాంత్ సినిమాలను కేవలం సౌత్ ఇండియన్స్ మాత్రమే చూస్తారు.

అలాగే ఖాన్స్ సినిమాలను కేవలం నార్త్ ఇండియన్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు. కానీ ప్రభాస్ సినిమా హిట్ అయితే మాత్రం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ ఒక్కరు ఎగబడి మరీ చూస్తారు. అందుకే ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా 400 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వస్తుంటాయి. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘సలార్’ చిత్రానికి 620 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇలాంటి స్టార్ స్టేటస్ ఉన్న ప్రభాస్ అసలు ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సలార్ చిత్రం లో నటించినందుకు గాను ప్రభాస్ అక్షరాలా 125 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడట. ఇండియా లోనే ఇది హైయెస్ట్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే దీనిని సెకండ్స్ లెక్కలో చూస్తే, ఒక్కో సెకండ్ కి ప్రభాస్ 80 లక్షల రూపాయిలు ఛార్జ్ చేస్తున్నట్టు అన్నమాట. సెకండుకి 80 లక్షల రెమ్యూనరేషన్ అంటే ప్రభాస్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన చేస్తున్న, చెయ్యబోయే సినిమాలకు కూడా ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట.
ఆయనకీ ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం రెండు రోజుల్లోనే రికవరీ అవుతున్నప్పుడు ఎందుకు 125 కోట్లు తీసుకోకూడదు? , అని అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం ప్రభాస్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ వంటి వారు కూడా తమ తదుపరి చిత్రాలకు వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్స్ ని తీసుకుంటున్నారు. పరిశ్రమ అభివృద్ధి చెందినప్పుడు ఆ రేంజ్ వ్యాపారాలు కూడా జరుగుతాయి అనడానికి నిదర్శనం ఇదే. ఇక ప్రభాస్ ప్రస్తుతం హీరో గా నటిస్తున్న ‘కల్కి’ చిత్రం మే 9 వ తారీఖున విడుదల కాబోతుంది.
TAGS