Interim Budget -2024 : ఆసక్తికరంగా మధ్యంతర బడ్జెట్ -2024
Interim Budget -2024 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని మధ్యంతర బడ్జెట్ అని చెబుతుంటారు. ఇది మూడు నెలల కాలానికే ఉంటుంది. వచ్చే కొత్త ప్రభుత్వం జులై మాసంలో కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ మధ్యంతర బడ్జెట్ పై ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు అనుగుణంగానే సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
మధ్యంతర బడ్జెట్ ప్రజలను ఆకట్టుకుంటుందా? పారిశ్రామిక రంగాలకు ప్రోత్సాహం కల్పించారు. రక్షణ శాఖకు రూ. 6.2 లక్షల కోట్లు కేటాయించారు. పాడి పరిశ్రమ కోసం రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇలా సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసి బడ్జెట్ రూపకల్పన చేశారు.
రహదారులకు రూ.2.78 వేల కోట్లు కేటాయించారు. కమ్యూనికేషన్ రంగానికి 1.78 వేల కోట్లు ప్రతిపాదించారు. ఉపాధిహామీ పథకానికి రూ. 86 వేల కోట్లు ఇస్తున్నారు. ఇలా పలు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి కేటాయింపులు చేయడం గమనార్హం. విద్యుత్ బిల్లులు 300 యూనిట్ల వరకు ఉచితంగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని సీతారామన్ ప్రకటించడం విశేషం.
2047 వరకు భారత్ ఆర్థికంగా ఎదిగేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ఆదుకున్నారు. మధ్యంతర బడ్జెట్ ఆకట్టుకునేలా ఉందని బీజేపీ ఎంపీలు పలువురు హర్షం వ్యక్తం చేశారు.