Puri Jagannath Mother : నా కొడుకు కారణంగా నా జీవితం రోడ్డున పడింది అంటూ పూరి జగన్నాథ్ తల్లి షాకింగ్ కామెంట్స్!
Puri Jagannath Mother : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్ అనే వ్యక్తి ఒక చరిత్ర. ఒకే రకమైన హీరోయిజం ని చూసి విసిగిపోయిన తెలుగు ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని కలిగించే హీరోయిజం ని పరిచయం చేసాడు ఆయన. అందుకే ఆయన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ సృష్టించేవి. పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చేసుకొని, పూరి జగన్నాథ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం వల్లే నేడు ఒక మాస్ డైరెక్టర్ ని మనమంతా చూస్తున్నాం.
పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన ‘బద్రి’ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది. తొలి సినిమానే ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రవితేజ తో ఈయన చేసిన ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రాలు, మహేష్ బాబు తో ఈయన చేసిన ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ వంటి చిత్రాలు టాలీవుడ్ స్థితి గతులను మార్చేశాయి.పూరి జగన్నాథ్ కి ఒక స్టార్ హీరో కి ఉన్నంత ఇమేజి ని తెచ్చిపెట్టాయి.
అయితే పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ కెరీర్ లో సూపర్ హిట్స్ బాగానే ఉన్నాయి కానీ, ఆయన రేంజ్ హిట్స్ మాత్రం లేవు. చిరుత , దేశముదురు, బిజినెస్ మెన్, టెంపర్ మరియు ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి కానీ పోకిరి రేంజ్ ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్స్ మాత్రం రాలేదు. ఆయన గత చిత్రం ‘లైగర్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే పూరి జగన్నాథ్ తల్లి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పూరి జగన్నాథ్ ఎదురుకున్న కష్టాలు గురించి చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ నా కొడుకు పడినన్ని కష్టాలు ఎవరు కూడా పడకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఏడవ తరగతి నుండే నా బిడ్డకి సినిమాల పిచ్చి మొదలైంది. డిగ్రీ పూర్తి అవ్వగానే అతను హైదరాబాద్ కి వచ్చేసాడు. అవకాశాలు కోసం వాడు పడిన కష్టాలు చూసి నా ఏడుపు వచ్చేది. ఒకరోజు వాడిని చూసేందుకు నేను హైదరాబాద్ కి వెళ్లాను. వాడి పాదాలు లావుగా వాచిపోయాయి. చెప్పులు వేసుకోవడానికి కూడా ఆ పాదాలు సహకరించడం లేదు. అంటే ఆ రేంజ్ లో వాడు స్టూడియోల చుట్టూ తిరిగేవాడు.
నేను వాడి కష్టం చూసి ఇంటికి వెళ్ళిపోదాం పద నాయనా, ఏదైనా పొలం పని చేసుకుంటూ జీవిద్దాం అని చెప్పాను. కానీ వాడు అందుకు ఒప్పుకోలేదు. అలా ఎన్నో కష్టాలు పడి నేడు ఈ స్థాయికి వచ్చాడు. ఒకానొక సందర్భంలో వాడి పక్కనే ఉండే స్నేహితుడు 80 కోట్లు దొబ్బేసాడు. అదే సమయం లో సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అప్పులు తీర్చేందుకు ఉన్న 5 ఇళ్లను అమ్మేశాము. రోడ్డు మీదకి కుటుంబం మొత్తం వచ్చేసే పరిస్థితి వచ్చింది’ అని చెప్పుకొచ్చింది.