Good Sleep Tips : మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా?

Good Sleep Tips

Good Sleep Tips

Good Sleep Tips : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. కడుపు నిండ తిండి కంటి నిండ నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇందులో ఏ ఒక్కటి లోపించినా శరీరం నశిస్తుంది. దీంతో రోగాల బారిన పడతాం. ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. రాత్రి 12 గంటల తరువాతే నిద్ర పోతున్నారు. ఇది మంచి అలవాటు కాదు. నిద్రకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకే మంచి నిద్ర పడుతుంది. ఇక ఆ తరువాత సరైన నిద్ర పట్టదు.

మంచి నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలున్నాయి. రాత్రి భోజనం తొందరగా చేయాలి. రాత్రి 7 గంటల లోపే డిన్నర్ చేసేయాలి. అది కూడా తేలికైన ఆహారాలు తీసుకుంటే మంచిది. తొందరగా జీర్ణం అయ్యే పదార్థాలు తినడం వల్ల త్వరగా అరిగి శరీరం తేలికగా మారుతుంది. దీంతో సుఖమైన నిద్ర పట్టేందుకు వీలు కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

మన చెవులకు ఇంపైన సంగీతం వింటే కూడా బాగుంటుంది. మంచి పుస్తకాలు చదివితే కూడా మనసు ఎంతో హాయిగా అవుతుంది. దీంతో మంచి నిద్ర పడుతుంది. గాఢ నిద్ర పడితేనే శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. దీంతో అవయవాలు బాగా పనిచేస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరైన నిద్ర పట్టేందుకు అవకాశం ఉంటుంది.

నిద్ర పట్టకపోతే ఓ ఐదు నిమిషాలు దీర్ఘ శ్వాసలు తీస్తూ యోగా చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది. దీని వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇలా ఈ టెక్నిక్ లు వినియోగించుకుని రోజు 7-8 గంటలు కచ్చితంగా నిద్రపోయేలా చూసుకోవాలి. లేకపోతే శరీరం సహకరించదు. పలు రోగాలు దరిచేరి మన ఆయువును తగ్గిస్తాయి.

TAGS