Rashmika-Vijay : ఆ విషయంలో ఆయన సపోర్టే ఎక్కువ.. విజయ్ గురించి సీక్రెస్ విషయాలు చెప్పిక రష్మిక
Rashmika-Vijay Devarakonda : ‘యానిమల్’ చిత్రంతో రణ్ బీర్ కపూర్ కు ధీటుగా నటించింది రష్మిక మందన. ఈ మూవీకి సంబంధించి ఆమె విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, సిద్ధార్థ్ మల్హోత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ‘అమితాబ్ సర్.. వయస్సులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారు. జీవితంలో ఏదైనా సాధించగలవనే నమ్మకాన్ని రణ్‌బీర్ ఇచ్చారు’ అన్నారు. ఇక, విజయ్ దేవరకొండ గురించి చెప్తూ.. ‘‘నేను చేసే ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. అతని సలహాలను తీసుకుంటా. అది నాకు చాలా అవసరం. ఏది మంచో, ఏది చెడో ఆయన వివరిస్తారు. అలా చెప్పడం బాగుంటుంది. వ్యక్తి గతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా నన్ను సపోర్ట్ చేశారు’ అని తెలిపారు.
ఇంతలా పొగుడుతున్న విజయ్ దేవరకొండను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని, దాదాపు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరుగుతుందని కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిని విజయ్ ఖండించారు. ‘ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదు. ప్రతీ రెండేళ్లకో సారి పెళ్లి చేయాలని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి. నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఏటా ఇలాంటి రూమర్లు వింటూనే ఉన్నా’ అని అన్నారు. విజయ్-రష్మిక గతంలో 2 సినిమాల్లో (గీత గోవిందం, డియర్ కామ్రేడ్)లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ విహారయాత్రలు, పార్టీలకు వెళ్లడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీసిన ‘ఛావా’లో విక్కీ కౌశల్ తో కలిసి రష్మిక నటించింది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ఈ మూవీని ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఇక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో నటిస్తుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ సినిమాల్లోనూ కనిపించనుంది. ప్రస్తుతం.. ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తున్న విజయ్ ఇది పూర్తయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించనున్నారు.