House Rents : పెరిగిన ఇంటి అద్దెలతో ఇబ్బందులు
House Rents : దేశంలోని నగరాల్లో ఇంటి అద్దెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కరోనా తరువాత క్రమంలో ఇంటి రెండ్లు ఎక్కువ అయ్యాయి. దీంతో మధ్య తరగతి ప్రజలకు ఇల్లు అద్దెకు తీసుకోవడం గగనంగానే మారుతోంది. ఈనేపథ్యంలో ఇంటి అద్దెల తీరు బాధాకరంగా ఉంటోంది. హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో ఇంటి అద్దెలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి.
కొవిడ్ పూర్వం ఇంటి అద్దెలు ఇంతలా పెరగలేదు. కానీ ప్రస్తుతం ఇంటి అద్దెలు దాదాపు 25-30 శాతం మేర పెరగడం గమనార్హం. ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు పెరగడంతో సామాన్యుడు అద్దెకు ఉండాలంటేనే జంకుతున్నారు. వారి సంపాదనలో ప్రధాన భాగం అద్దె కోసం వెచ్చించాల్సి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా న్యూయార్క్, లండన్, దుబాయి, సింగపూర్ వంటి దేశాల మార్కెట్లతో పోలిస్తే మన దేశంలో గ్యాప్ చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.
దేశంలోని నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019తో పోలిస్తే ప్రస్తుతం 15-20 శాతం పెరిగినట్లు హౌసింగ్ కామ్ నివేదిక తెలియజేసింది. అద్దె ఇళ్ల కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. కొనుగోలు ఇండెక్స్ తో పోలిస్తే ఐఆర్ఐఎస్ ఇండెక్స్ 23 పాయింట్లు అధికంగా ఉందని తెలుస్తోంది. ఇలా ఇంటి అద్దెల భారం సామాన్యులకు గుదిబండగా మారుతోంది.
ఇంటి అద్దెల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటి అద్దెల గోలతో చాలా మంది సతమతమవుతున్నారు. ఖరీదైన ఇళ్లల్లో అద్దెలు చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. వేలకు వేలు అద్దె కోసం కేటాయించాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. నగరాల్లో నివాసం కంటే పల్లెటూల్లే నయం.