Meenakshi Chaudhary : ఆ హీరోతో నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ మీనాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్!

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary emotional words

Meenakshi Chaudhary : ఇటీవల ఇండస్ట్రీ లోకి వచ్చిన యంగ్ హీరోయిన్స్ దూకుడు మామూలు రేంజ్ లో లేదు. ఒక పీరియడ్ లో ఒక యంగ్ హీరోయిన్ వరుస అవకాశాలతో దూసుకుపోతే, మరో పీరియడ్ ఇంకో యంగ్ హీరోయిన్ అంతకు మించిన దూకుడు తో దూసుకుపోతుంది. హీరోల మధ్య కంటే ఇప్పుడు హీరోయిన్స్ మధ్య పోటీ ఎక్కువ అయిపోయింది. ఉదాహరణకి నిన్న మొన్నటి వరకు శ్రీలీల జోరు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగిందో మన కళ్లారా చూసాము.

సునామి లాగ దూసుకొచ్చి, వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దుమ్ము లేపేసింది. అయితే సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల ఈ హాట్ బ్యూటీ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తగిలాయి. దీంతో ఎంత పైకి వెళ్లిందో, అంత క్రిందకి చాలా తొందరగా పడిపోయింది. ఇప్పుడు అందరి చూపు మీనాక్షి చౌదరి మీద పడింది. వరుసగా ఆఫర్స్ ఆమె ఇంటి తలుపులను తడుతున్నాయి.

సుశాంత్ హీరో గా నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ అవకాశాలు అయితే బాగానే వచ్చాయి. ఈ సినిమా తర్వాత ఆమె రవితేజ హీరో గా నటించిన ‘ఖిలాడీ’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ‘హిట్: ది సెకండ్ కేస్’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాల్లో నటించింది. గుంటూరు కారం సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ, మీనాక్షి చౌదరి అందరి దృష్టిలో మాత్రం బలంగా పడింది. అందుకే ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా హిట్ అయితే ఇక మీనాక్షి చౌదరి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఒక 5 ఏళ్ళ పాటు నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగే పరిస్థితి వస్తుంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె విజయ్ గురించి మాట్లాడుతూ ‘అంత పెద్ద సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం నా అదృష్టం. షూటింగ్ లో జరుగుతున్న ప్రతీ మూమెంట్ నాకు ఒక మధుర జ్ఞాపకమే’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

TAGS