Shraddha Das : ఆ హీరోయిన్ షూటింగ్ లో కొట్టిన దెబ్బలకు గాయాలు ఇంకా మానలేదు అంటూ శ్రద్దా దాస్ షాకింగ్ కామెంట్స్!
Shraddha Das : టాలీవుడ్ లో అందం తో పాటుగా అభినయం కూడా చూపించగల అతి తక్కువ మంది హీరోయిన్స్ లో శ్రద్ద దాస్ ఒకరు. కానీ ఈమె హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం. అయితే రీసెంట్ గా ఈమె ప్రముఖ హీరోయిన్, ప్రస్తుత హిందీ బిగ్ బాస్ సీజన్ 17 టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరైన మన్నారా చోప్రా గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
వీళ్లిద్దరు కలిసి గతం లో హిందీ లో ‘జిద్’ అనే చిత్రం లో నటించారు. ఇందులో శ్రద్ద దాస్ హీరోయిన్ గా నటించగా, మన్నారా చోప్రా విలన్ గా నటించింది. ఫైట్ సన్నివేశాలు వచ్చినప్పుడు మన్నారా చోప్రా తనని ఎంతలా టార్చర్ చేసిందో చెప్పుకొచ్చింది శ్రద్ద దాస్. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘జిద్ సినిమాలో మన్నారా చోప్రా నన్ను మెట్ల మీద నుండి తోసేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశం లో నన్ను చిన్నగా తోయాలీ, కానీ ఆమె నన్ను చాలా బలంగా తోసింది. ఒక సన్నివేశం లో ఆమె నన్ను చాతి మీద కొట్టాలి, డైరెక్టర్ చెప్పిన విధంగా అయితే చాలా చిన్నగా కొట్టాలి, కానీ తన బలం మొత్తం ఉపయోగించి గట్టిగా కొట్టేసింది. చాలా దెబ్బలు తగులుతున్నాయి, చూసుకో, చిన్నగా చెయ్యి అని పలుమార్లు ఆమెని రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోలేదు.
ఒక సన్నివేశం లో నకిలీ కర్రలతో నన్ను కొట్టాల్సి ఉండగా, ఆమె నిజమైన కర్ర ఉపయోగించి చితక బాదింది. నాకు సీరియస్ అయ్యి హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బలకు సంబంధించిన గాయాలు ఇప్పటికీ నా శరీరం మీద ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది శ్రద్దా దాస్.