Childrens Day Special Actors : చిల్డ్రన్స్ డే స్పెషల్.. నాటి బాలనటులే నేటి హీరోలు.. ఎవరెవరంటే?
Childrens Day Special Actors : టాలీవుడ్ లో ఒకప్పుడు బాలనటులుగా నటించిన వారే ఇప్పుడు హీరోలుగా నటిస్తున్నారు.. మరి అప్పట్లో బాలనటులుగా నటించిన పిల్లలు ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్న తరుణంలో అలాంటి వారు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం..
నందమూరి కుటుంబంలో హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఇలా బాలనటులుగా రాణించిన వారే ఆ తర్వాత హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ 13 ఏళ్లకే తాతమ్మ కల సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక హరికృష్ణ శ్రీకృష్ణుడి అవతారంలో బాల నటుడిగా పరిచయం అయ్యి ఎన్నో సినిమాల్లో ఈయన నటించి మెప్పించాడు. ఎన్టీఆర్ కూడా బాల నటుడిగా నటించాడు కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత బాల రామాయణం సినిమాలో నటించాడు.
నాగార్జున కూడా అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగ్ చాలా తక్కువ వయసులోనే ‘వెలుగు నీడలు’ సినిమాలో నటించారు. ఆ తర్వాత సుడిగుండాలు సినిమాలో కూడా కనిపించాడు.. ఇక ఈయన వారసుడిగా అఖిల్ అక్కినేని కూడా సిసింద్రీ సినిమాతో ఏది వయస్సులోనే సినిమాలో కనిపించి ఆకట్టుకున్నాడు.
విక్టరీ వెంకటేష్ తండ్రి రామానాయుడు నిర్మించిన ప్రేమ నగర్ సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు..
సూపర్ స్టార్ కృష్ణ వారసులు రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరు బాల నటులుగా నటించారు.. రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు, మనుషులు చేసిన దొంగలు వంటి సినిమాల్లో నటించారు.. ఇక మహేష్ బాబు నీడ సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత దాదాపు 15 సినిమాలు చేసాడు..
అల్లు అర్జున్ కూడా బాల నటుడిగా విజేత, స్వాతి ముత్యం సినిమాల్లో నటించాడు.
అలీ కూడా నాలుగేళ్లు ఉన్నప్పుడే సినిమాల్లోకి వచ్చాడు.. ఈయన చిన్నప్పుడు మొదలైన ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.
లవర్ బాయ్ తరుణ్ గురించి కూడా అందరికి తెలుసు.. ఈయన బాలనటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.
తనీష్ ఇప్పుడు ఆకట్టుకోవడం లేదు కానీ.. బాల నటుడిగా ఉన్నప్పుడు స్టార్ అనే చెప్పాలి.. దేవుళ్ళు, మన్మధుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.
మంచు మనోజ్ కూడా మోహన్ బాబు వారసుడిగా బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. చాలా సినిమాల్లో ఈయన నటించి అలరించాడు.
బాలాదిత్య చండిగాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకంటే ముందే ఈయన చిన్నప్పుడే చాలా సినిమాల్లో బాల నటుడిగా చేసాడు.
తేజ సజ్జా వెంకటేష్ ప్రేమించుకుందాం రా, ఆ తర్వాత ఇంద్ర వంటి సూపర్ హిట్స్ తో బాగా పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఈ కుర్ర హీరో మంచి హుషారుగా దూసుకు పోతున్నాడు.
ఆకాష్ పూరి.. ఇతడు కూడా పూరి జగన్నాథ్ తనయుడిగా మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు.. ఇతడు బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించాడు..
సంతోష్ శోభన్ కూడా ఈ మధ్య చాలానే ఫేమస్ అయ్యాడు. ఇతడు కూడా బాల నటుడిగా సినిమాలు చేసాడు.. ఇక ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే..