Rajamouli and Mahesh Babu : మహేశ్ ను పార్ట్ నర్ గా ఉండాలని కోరిన రాజమౌళి!

Rajamouli and Mahesh Babu

Rajamouli and Mahesh Babu

Rajamouli and Mahesh Babu : రాజమౌళి సినిమా అంటే మాములుగా ఉండదు. ఆయన డైరెక్షన్ లో తమ కెరీర్ లో ఒక్క మూవీ అయిన చేయాలని ప్రతీ హీరో తహతహలాడుతుంటాడు. కానీ ఆయన ఎప్పుడూ ఎవరికీ చాన్స్ ఇస్తాడో తెలియదు. అది వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మహేశ్ వంతు వచ్చింది. ఈ సినిమా కోసం మహేశ్ ఫ్యాన్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా చేయాలంటే మహేశ్ బాబుకు రాజమౌళి ఎన్నో షరతులు విధించాడట. మార్చి నుంచి సినిమా విడుదల వరకూ మహేశ్ నుంచి ఒక్క ఫొటో కూడా బయటకు రాకూడదన్నది ఓ అగ్రిమెంట్. మహేశ్ స్వతహాగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటాడు. షెడ్యూల్ మధ్యలో చిన్న బ్రేక్ దొరికినా విదేశాలకు చెక్కేస్తుంటాడు. అలాంటి టూర్లు కూడా ఇక ఉండబోవని తెలుస్తోంది. పైగా మహేశ్ చాలా బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉంటున్నాడు. రాజమౌళి సినిమా పూర్తయ్యేంత వరకూ ఆ యాడ్స్ లో కూడా మహేశ్ ఇకపై కనిపించడు. షూటింగ్ అయ్యేంతలోగా.. మహేశ్ లుక్ బయటకు రాకుడదన్నది ఉద్దేశంతోనే రాజమౌళి ఇలాంటి కండీషన్లు  పెట్టాడని తెలుస్తోంది.

అయితే వీటికి మహేశ్ కూడా సిద్ధంగానే ఉన్నాడని సమాచారం. ఈ సినిమాలో మహేశ్ లుక్ పూర్తిగా కొత్త స్థాయిలో ఉండబోతోందని తెలుస్తోంది. కేవలం లుక్ టెస్ట్ కోసమే నెల రోజుల సమయం కేటాయించాల్సి వస్తోందట.  రాజమౌళి ఇప్పటికే కొన్ని స్కెచ్ లు  సిద్ధం చేశాడు. వాటికి అనుగుణంగా మహేశ్ తన లుక్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చిలో మహేశ్ పై రాజమౌళి ఫొటో షూట్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. వాటి వివరాలు పూర్తిగా సీక్రెట్ గా  ఉంచుతున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం మహేశ్ బాబును 3 సంవత్సరాల డేట్లు కేటాయించాలని అడిగాడట.  సినిమా అద్భుతంగా తెరకెక్కించడానికి ఆ మాత్రం సమయం పడుతుందని చెప్పాడట. ఈ సినిమా ఇద్దరి కెరీర్ లను మారుస్తుందని, అంత సమయం పెట్టవచ్చని మహేశ్ కు సూచించాడట. ఈ ఒక్క సినిమా తెచ్చే క్రేజ్ తో లైఫ్ సెట్ అయిపోతుందని అన్నాడట. మాములుగా అయితే మహేశ్ నుంచి సంవత్సరానికి ఒక్క సినిమా వస్తుంటుంది. మూడేండ్లకు మూడు సినిమాలు అనుకోవచ్చు. అలాగే ఎన్నో యాడ్స్ చేస్తుంటాడు. ఇక నుంచి అవన్నీ బంద్ కాబట్టి.. వాటికొచ్చే రెమ్యూనరేషన్ ఈ ఒక్క సినిమాతో వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.

ఈ సినిమాకు నిర్మాతగా కేఎల్ నారాయణ వ్యవహరిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో మహేశ్ కు సినిమా మధ్యలో రెమ్యూనరేషన్ ఇవ్వబోరని, ఈ ప్రాజెక్టులో మహేశ్ ను కూడా పార్ట్ నర్ గా చేరాలని రాజమౌళి సూచించాడట. సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లను షేర్ చేసుకుందామని సలహా ఇచ్చాడట. మరి దీనికి మహేశ్ అంగీకరించాడా అనేది తెలియాల్సి ఉంది.

TAGS