Tejaswini : జారిపోతున్న ఎద అందాలతో సెగలు రేపుతోన్న తేజస్విని

Tejaswini : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన తేజస్విని మదివాడ రాను రాను లీడ్ రోల్స్ చేసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో గెస్ట్ రోల్ చేసింది. 2012లోనే కెరీర్ మొదలు పెట్టిన తేజస్వినికి అంత చెప్పుకోతగ్గ క్యారెక్టర్లు రాలేదు. కానీ 2018లో ఆమె బిగ్ బాస్ సీజన్ 2కు ఎంపికైంది. అప్పటి నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

బిగ్ బాస్ లో తేజస్వి తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో క్రేజ్ తెచ్చుకుంది. కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే లాంటి సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది. సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూనే వీలున్నప్పుడల్లా హాట్ ఫొటో షూట్‌లు చేస్తూ కేక పెట్టిస్తుంది.

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అతిథి పాత్రలో నటించిన తేజస్వి తమిళంలో కూడా నటించింది. గ్లామర్ విషయంలో కూడా బాగా డోస్ పెంచుకుంది. బిగ్ బాస్ 2 తర్వాత గ్లామర్ విషయంలో రెచ్చిపోయింది. ఈ మధ్య ఫొటో షూట్ అంటూ పిచ్చెక్కిస్తోంది.

తేజస్వి 1991, జూలై 3వ తేదీ హైదరాబాద్ లో జన్మించింది. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తేజస్వి మాస్‌ కమ్యూనికేషన్‌లో పట్టా పొందింది. చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకున్న తేజస్వి పాశ్చాత్య నృత్యరీతులపైనా దృష్టి పెట్టి ఆ డాన్స్‌లోను ప్రావీణ్యం సంపాదించింది. అల్లు అర్జున్ తో కలిసి ‘7అప్‌’ ప్రకటనలో పని చేసింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీమ్‌లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమాతో ఆమెకు గ్లామర్ రోల్స్ పెరిగాయి.  ఇక వీలున్నప్పుడల్లా ఖతర్నాక్ ఫొటో షూట్‌లో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా ఈ భామ పంచుకున్న కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.

జారిపోతున్న ఎద అందాలతో కుర్రకారుకు చెమటలు పెట్టించింది. ఈ పిక్స్ చూసిన ప్రతీ ఒక్కరూ వావ్ తేజస్విని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తేజస్విని అందం ఇండస్ట్రీని కుదిపేస్తుందనే చెప్పవచ్చు.

TAGS