China Won Against Pollution : కాలుష్యాన్ని గెలిచిన చైనా.. ఢిల్లీ నేర్చుకోవాలి పాఠాలు..

China Won Against Pollution

China Won Against Pollution

China Won Against Pollution : ప్రకృతి ఆగ్రహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అన్ని దేశాలకు తెలిసిందే. కొన్ని దేశాలు తట్టుకొని నిలబడి నిదానంగా పద్ధతులను మార్చుకుంటాయి. కొన్ని దేశాలు బలవుతాయి. ఇదంతా కామనే.. అయితే ఐదేళ్ల కింద చైనా భయానకమైన కాలుష్య సమస్యలను ఎదుర్కొంది. ఆ సమయంలో విద్యా సంస్థలను మూసి వేసింది.. ప్రతీ ఒక్కరూ మాస్క్ లు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆ సమయంలో చైనా ఎండను చూడని పరిస్థితిని ఎదుర్కొంది. నేలపై కమ్ముకునే పొగ మంచుతో విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడి సమీపంలోని వస్తువులు, మనుషులు కూడా కనిపించలేదు. ఈ దుస్థితి నుంచి బయట పడేందుకు పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లింది. రూ. 19వేల కోట్లతో భారీ పథకాలను తెచ్చింది. ప్రజలు కొంత ఇబ్బంది పడ్డా ప్రభుత్వం మాత్రం తను తీసుకున్న నిర్ణయం మేరకు పనులు చేస్తూ వెళ్లింది. దీంతో కేవలం ఐదేళ్లలో పరిస్థితులను సాధారణ పరిస్థితికి తేగలిగింది.

అయితే ఇప్పుడు దేశ రాజధాని న్యూ ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు గతంలో చైనా తీసుకున్న చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  దీపావళి వేడుకలకు బాణా సంచా కాల్చడంతో ఎయిర్ పొల్యూషన్ దారుణంగా ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షంతో సమస్యలు కొంత మేరకు సద్దుమణిగినా.. ఢిల్లీ వాసులు ఊపిరి పిల్చుకునే లోగానే దీపావళి వచ్చి మళ్లీ ఆగం చేసింది. దేశ రాజధానితో పాటు గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల్లో బాణసంచా ఎక్కువవడంతో పొగమంచు కమ్మేసింది. దీంతో కాలుష్య సూచీ 400 కు చేరింది. దీంతో గాలి మరింత విషపూరితంగా మారింది. ఇలాంటి పరిస్థితినే గతంలో చైనా ఎదుర్కొంది.

గాలి కలుష్యమైతే అందులో ఉండే సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లో చేరి అవయవాన్ని పాడు చేస్తాయి. సూక్ష్మ కణాలు 2.5 దాటితే ఎయిర్ పాయిజన్ ఏర్పడుతుంది. చైనాలో ఈ దశకు చేరుకోవడంతో చాలా మంది మరణించారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో ముందుగా మరమ్మతుకు గురైన వాహనాలపై నిషేధం విధించింది. నిత్యం రద్దీగా ఉండే కొన్ని పెద్ద సిటీల్లో కార్ల వాడకంను తగ్గించింది. వాయు కాలుష్యానికి కారణమైన ఫ్యాక్టరీలను మూసి వేయించింది.

నగరాల్లో స్వచ్ఛమైన గాలి ప్రసవించేందుకు కారిడార్లు ఏర్పాటు చేసింది. ఒక ఉద్యమంలా మొక్కల పెంపకం చేపట్టారు. బొగ్గు వినియోగం పూర్తిని నిలిపివేశారు. నివాసాల్లో సైతం ఎయిర్ ప్యూరీఫైర్లను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీలు ఇచ్చారు. దీనితో పాటు గతంలో బొగ్గు పొయ్యిలను ఉపయోగించిన చైనా.. వాటిని పూర్తిగా నిషేధించింది. బొగ్గు పొయ్యిల స్థానంలో సహజ వాయువు, కరెంట్ హీటర్లను ఇచ్చింది.

ఈ విధాలను ప్రభుత్వం కఠినంగా అమలు చేయడంలో కేవలం ఐదేళ్లలోనే చైనా మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఎయిర్ పొల్యూషన్ తగ్గింది. పొగ మంచు పూర్తిగా కనిపించకుండా పోవడంతో పాటు ప్రతీ రోజు సూర్యరశ్మి ధారాలంగా పడుతుంది. భారతదేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటేనే తక్షణ మార్పు సాధ్యమని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TAGS