Sania Mirza Life : సానియా మీర్జా జీవితంలో ట్విస్ట్.. సోహ్రాబ్ మీర్జా ఎవరో తెలుసా?

Sania Mirza Life

Sania Mirza Life

Sania Mirza Life : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. కానీ ఇటీవల వారి మధ్య పొడచూపిన విభేదాలతో విడాకులు తీసుకున్నారు. మాలిక్ సానియాకు విడాకులిచ్చి ప్రముఖ నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 20న షోయబ్ మాలిక్ సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

సానియా మీర్జా షోయబ్ మాలిక్ తో పెళ్లి కాక ముందే తన ఫ్రెండ్ సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. హైదరాబాద్ లో ప్రముఖ బేకరీ అయిన యూనివర్సల్ బేకర్స్ ఓనర్ సోహ్రాబ్ మీర్జాతో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. జులై 2009లో ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరిద్దరు హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీలో కలిశారు

సానియా చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడింది. యూకేలో ఎంబీఏ పూర్తి చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కొద్ది రోజుల ముందు సానియా, షోయబ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. సానియా పెద్దలను ఒప్పించి షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. సోహ్రాబ్ మీర్జాను పెళ్లి చేసుకుని ఉంటే జీవితం బాగయ్యేదని పరోక్షంగా కామెంట్లు చేస్తున్నాడు.

ఇప్పుడు సానియా మీర్జా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం విడాకులు తీసుకున్న వార్త సంచలనంగా మారింది. వారికి సంతానం కూడా కలిగింది. ఎందుకు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయో తెలియడం లేదు. దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సానియా మీర్జా జీవితం ఇప్పుడు ఎటు వైపు వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు.

TAGS