Mrunal Thakur : నాకు అవకాశాలు రానివ్వకుండా తోక్కేస్తున్నారు అంటూ మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్!

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur : సీరియల్స్ లో హీరోయిన్ గా రాణించి, ఆ తర్వాత అనేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించుకొని, వచ్చిన ఆ పాపులారిటీ తోనే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలను సంపాదించినా నటి మృణాల్ ఠాకూర్. ఈమె తెలుగు లో మనకి ‘సీత రామం’ సినిమా లో సీత మహాలక్ష్మి పాత్ర ద్వారా మాత్రమే మనకి తెలుసు. కానీ అంతకు ముందు ఆమె బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

కానీ తెలుగు సినిమా ఆడియన్స్ పంచినంత ప్రేమ ఆమెకి బాలీవుడ్ ఆడియన్స్ పంచలేదు. అందుకే ఆమె ఇప్పుడు హిందీ సినిమాల్లో కంటే తెలుగు సినిమాల్లో నటించడానికే ఎక్కువ ఆసక్తి ని చూపిస్తుంది. రీసెంట్ గానే ఆమె న్యాచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనమంతా చూసాము. ఈ సినిమాతో ఆమె నటిగా కూడా ఒక మెట్టు ఎక్కేసింది.

ఈ చిత్రం తర్వాత ఆమె క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీ అతి త్వరలోనే ప్రకటించనున్నాడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా తర్వాత ఆమె మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ లో కూడా ఒక హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా వరుసగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ వెళ్తున్న మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా బాలీవుడ్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆమె మాట్లాడుతూ ‘నాకు రొమాంటిక్ సినిమాల్లో నటించాలని కోరికగా ఉంది. కానీ నాకు బాలీవుడ్ ఎవ్వరూ అవకాశాలు ఇవ్వడం లేదు. బహుశా నేను పాపులర్ హీరోయిన్ కాదు అనేమో నాకు అలాంటి సినిమాలు ఇవ్వట్లేదు. నిర్మాతలకు నన్ను అలాంటి పాత్రల్లో చూడాలని ఉన్నప్పటికీ కొంత మంది హీరోలు అందుకు అడ్డుపడుతున్నారు. వాళ్లెవరో నాకు బాగా తెలుసు’ అంటూ మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇంతకు ఆ హీరోలు ఎవరు, మృణాల్ ఠాకూర్ కి ఎందుకు అవకాశాలు రప్పించడం లేదు అని ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు నెటిజెన్స్.

TAGS