Former CM Karnataka : కర్ణాటక బీజేపీలో చేరిన మాజీ సీఎం.. సోనియా, రాహుల్ కు ఇక కష్టాలే?
Former CM Karnataka : ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీకి నష్టం కలిగించేలా కొందరు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఓటమి పాలైంది. మళ్లీ వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో వారి ప్లాన్లకు మంచి ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరిన నేతలు తిరిగి పార్టీలోకి వస్తున్నారు.
దీంతో బీజేపీ పార్టీ పుంజుకుంటోంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ మేరకు పక్కా ప్లాన్లు రచిస్తున్నారు. పార్టీ వీడిన వారిని చేర్చుకునేందకు వారికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఈనేపథ్యంలో కర్ణాటక బీజేపీని గాడిలో పెట్టే పనిలో అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు నడ్డాతో సమావేశమైన తరువాత మాజీ సీఎం జగదీష్ శెట్లర్ బీజేపీలో చేరారు. ఈయన ప్రస్తుతం విధాన పరిషత్ అధ్యక్షుడు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ రాకపోవంతో మాజీ సీఎం జగదీష్ శెట్లర్ కాంగ్రెస్ లో చేరారు. మాజీ డీసీఎం లక్ష్మణ్ సవది కూడా కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం యడ్యూరప్ప ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వారిని తిరిగి తీసుకొచ్చేందుకు అధిష్టానాన్ని ఒప్పించి వారిని తిరిగి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు.
జగదీష్ శెట్లర్ ను సొంత పార్టీలోకి తీసుకురావాలని అమిత్ షా రంగంలోకి దిగి సక్సెస్ అయ్యారు. యడ్యూరప్ప ప్లాన్ కు సంతోష్ తోడయ్యారు. కర్ణాటకలో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలో బీజేపీలో మరికొంత మంది చేరతారని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీలో రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.