Junior NTR : ఆమెతో రొమాన్స్ చెయ్యడం నా వల్ల కాదంటూ లొకేషన్ నుండి పారిపోయిన జూనియర్ ఎన్టీఆర్!
Junior NTR : టాలీవుడ్ మాస్ జానర్ సినిమాలు తియ్యాలనుకుంటే ఏ డైరెక్టర్ కి అయినా ముందుగా గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చిన్న వయస్సులోనే ఆది, సింహాద్రి లాంటి బలమైన పాత్రలు మోసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షాక్ చేసాడు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కి సైతం పోటీ ని ఇచ్చి, నెంబర్ 1 నువ్వా నేనా అనే రేంజ్ కి ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోనే ఎదిగాడంటే ఎన్టీఆర్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ కి అన్ని జానర్స్ లో సూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ లవ్ జానర్ లో మాత్రం ఆయనకి సూపర్ హిట్ లేదు. మూడవ సినిమా సుబ్బు తో ప్రేమకథ లో మెప్పించడానికి ప్రయత్నం చేసాడు కానీ, ఆ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో మళ్ళీ ఆయన ఆ జానర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
సుబ్బు చిత్రం ఫ్లాప్ అవ్వడం తో ఎన్టీఆర్ లవ్ స్టోరీస్ కి దూరం గా ఉంటూ వచ్చాడు. అంతే కాదు తన సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడానికి కూడా ఎన్టీఆర్ ఏమాత్రం ఇష్టం చూపాడట. గతం లో ఎన్నో సందర్భాలలో దర్శకులకు ఎన్టీఆర్ నుండి ఈ విషయం లో చేదు అనుభవం అయ్యినట్టు చెప్తున్నారు. ఉదారణకి ఎన్టీఆర్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహాద్రి’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో భూమిక తో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక లిప్ లాక్ సన్నివేశం రాసాడట రాజమౌళి. దీనికి ఎన్టీఆర్ ‘ఆమ్మో ఆమెతో లిప్ లాక్ సన్నివేశామా..నీకో దండం పెడుతా నన్ను వదిలేయ్’ అంటూ షూటింగ్ లొకేషన్ నుండి పారిపోయాడట ఎన్టీఆర్. ఈ విషయాన్ని రాజమౌళి ఇప్పటికీ తన సన్నిహితులతో చెప్తూ నవ్వుకుంటూ ఉంటాడట.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఏప్రిల్ 5 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, అప్పటికీ షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం లేకపోవడం తో ఈ సినిమాని వాయిదా వేసినట్టు సమాచారం.