Fighter Movie Banned : గల్ఫ్ దేశాల్లో హృతిక్ ‘ఫైటర్’ను ఎందుకు బ్యాన్ చేశారు? అసలు వివాదమేంటి?
Fighter Movie Banned : హృతిక్ రోషన్, దీపికా పదుకోణ్ జంటగా నటించిన ‘ఫైటర్’ యూఏఈ మినహా అన్ని గల్ఫ్ దేశాల్లో విడుదలకు నోచుకోలేదు. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలో జనవరి 25న థియేటికల్ రిలీజ్ కాబోతోంది. అయితే గల్ఫ్ దేశాల్లో సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు నటించారు. పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్ పట్టణ పరిసర ప్రాంతాల్లో భారత సాయుధ దళాలు చేసిన బాలాకోట్ వైమానిక దాడుల చుట్టూ కథ తిరుగుతుంది. జమ్ము-కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద శిబిరంపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడిలో దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
2008లో వచ్చిన బచ్నా ఏ హసీనో, 2023 బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రాల తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ తో దీపికా నటిస్తున్న మూడో చిత్రమిది. హృతిక్ రోషన్ తో కూడా సిద్ధార్థ్ ఆనంద్ కు మూడో సినిమానే. వారి చిత్రాలు వరుసగా బ్యాంగ్ బ్యాంగ్!, రెండోవ సినిమా టైగర్ ష్రాఫ్, కాగా మూడో ఫైటర్.
స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా అలియాస్ పాటీ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మినాల్ రాథోడ్ అలియాస్ మిన్నీ పాత్రలో దీపికా పదుకోణ్ నటించింది. గ్రూప్ కెప్టెన్ రాకేశ్ జై సింగ్ అలియాస్ రాకీ పాత్రలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నారు.
ఈ చిత్రం గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘మమతా (సిద్దార్థ్ భార్య), నేను కలిసి మార్ఫిక్స్ అనే ఫిల్మ్ కంపెనీ ప్రారంభించాం. ఈ కంపెనీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఫైటర్. ఇది మాకు కేవలం సినిమా మాత్రమే కాదు. పఠాన్ పై మీరు కురిపించిన ప్రేమను ఫైటర్ పై కూడా కురిపించాలని ఆశిస్తున్నాను అని గతంలో అన్నారు.