Sania-Shoaib Divorce : సానియా-షోయబ్ విడాకులు..వెలుగులోకి సంచలన విషయాలు..
Sania-Shoaib Divorce : సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల విషయం, షోయబ్, నటి సనా జావేద్ పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా వీరి విడాకుల విషయమై మరికొన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. స్పోర్ట్స్ కపుల్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడిపోయారంటే గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే తమ మాటలు, చేష్టల ద్వారా పరోక్షంగా వాటిని ఖండించుకుంటూ వచ్చారు. కానీ తాజాగా షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్తలు నిజమేనని అందరికీ తెలిసింది. ఇదిలా ఉండగానే.. రీసెంట్ గా సానియా తన ఇన్ స్టా స్టోరీస్ లో పెట్టిన ఓ ఆసక్తికర పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. షోయబ్, సానియా విడాకులు తీసుకున్నట్లు ఇందులోనే ఆమె పరోక్షంగా పేర్కొంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి సంబంధించిన వార్తలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ నటి సనా జావేద్ ను ఆయన తాజాగా పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆయనకు మూడో పెళ్లి అని తెలిసిందే. 2002లో అయేషా సిద్ధిఖీని పెళ్లి చేసుకున్న షోయబ్..2010లో ఆమెకు విడాకులు ఇచ్చారు. తర్వాత అదే ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లి బాగా పాపులర్ గా నిలిచింది. పెళ్లి తర్వాత ఈ జంట దుబాయ్ లో స్థిరపడ్డారు. 2018లో వీరికి కొడుకు పుట్టాడు. అతడికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే పేరు పెట్టారు.
షోయబ్, సానియాది సుదీర్ఘ వివాహ బంధం. వీరు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒకరినొకరు బాగా ప్రోత్సహించుకునేవారు. బర్త్ డేలు, ఫ్యామిలీ ఈవెంట్లు, వెకేషన్స్..ఇలా అన్నీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. గత రెండేళ్ల నుంచి వీరి వివాహ బంధంపై పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరు విడిపోయారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. వీటికితోడు షోయబ్ తన ట్విటర్ బయో నుంచి సానియా పేరు తొలగించడం, సానియా కూడా షోయబ్ తో దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయినా కూడా ఈ జంట విడాకుల వార్తలను గత కొంతకాలంగా తోసిపుచ్చుకుంటూ వచ్చారు.
తాజాగా సానియా, షోయబ్ విడిపోవడానికి కారణాలు ఇవే అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సనా, షోయబ్ గత మూడేండ్లుగా రహస్యంగా కలుసుకుంటున్నారని.. అయితే ఇప్పటికే సనాకు ఉమైర్ జస్వాల్ తో పెళ్లయిందని పాక్ కు చెందిన ఓ మీడియా తెలిపింది. ఆ తర్వాత ఇద్దరూ క్రమం తప్పకుండా కలుసుకోవడం మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ ఏదైనా షోకు వచ్చే ముందు సనాను గెస్ట్ గా పిలిస్తే వస్తానని కండీషన్ పెట్టేవాడని ఆ మీడియా పేర్కొంది. పెళ్లి కొద్దిరోజుల ముందే సనా విడాకుల విషయం ఉమైర్ కు చెప్పినట్టు సమాచారం. దీంతో ఉమైర్ షాక్ అయ్యాడట.
ఇక సానియా, షోయబ్ విడాకుల వ్యవహారం శాంతియుతంగా ముగిసిందని.. విడిపోయిన విషయం సైతం ఎవరికీ తెలియలేదని.. ఇదంతా చాలా సైలెంట్ గా జరిగిందని పాక్ మీడియా పేర్కొంది. విడిపోయే విషయంలో షోయబ్ కుటుంబం కూడా సానియాకే మద్దతు తెలిపిందని తెలిపింది. షోయబ్, సనా వివాహానికి అతడి కుటుంబ సభ్యులు కూడా హాజరుకాలేదని చెప్పింది.