Today Horoscopes : నేటి రాశి ఫలాలు
Today Horoscopes : మేష రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పనులు చేపడతారు. మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళతారు. లక్ష్మీదేవిని ఆరాధించడం శుభకరం.
వ్రషభ రాశి వారికి కొందరి తీరు బాధ కలిగిస్తుంది. సమస్యలు వస్తాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. గోసేవ చేయడం క్షేమం.
మిథున రాశి వారికి మీ ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది.
కర్కాటక రాశి వారికి శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అధికారుల అండ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనుకూల ఫలితాలు ఇస్తుంది.
సింహ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గొడవలకు వెళ్లకండి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఇష్టదేవతారాధన చేయడం మేలు కలిగిస్తుంది.
కన్య రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. మనోబలం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదేవతను ఆరాధించడం శుభకరం.
తుల రాశి వారికి మీ అంచనాలు తప్పుతాయి. కీలక విషయాల్లో అజాగ్రత్త వద్దు. పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. సూర్యుడిని పూజించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
వ్రశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. శ్రీరామ రక్ష స్తోత్రం చదవడం శ్రేయస్కరం.
ధనస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. మంచి ఆలోచనతో పనులు పూర్తి చేసుకుంటారు. ఆంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేయడం అన్ని విధాలా శ్రేయోదాయకం.
మకర రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
కుంభ రాశి వారికి మనసుకు బాధ కలిగించే సంఘటనలున్నాయి. చేసే పనుల్లో అలసట లేకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మేలు చేస్తుంది.
మీన రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలున్నాయి. ఇష్టదేవతారాధన శుభాలు కలిగిస్తుంది.