Ayodhya Mandir : అయోధ్యకు జగన్ ఎందుకు వెళ్లలేదు?
Ayodhya Mandir : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా సుమారు 8 వేల మంది అతిథులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేతలు తరలివచ్చారు. ఏపీ నుంచి సీఎం జగన్ ఎందుకు హాజరు కాలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ కు ఆహ్వానం అందిందా? లేదా? అనేది కూడా సందేహమే. ముఖ్యమంత్రి అయి ఉండి అయోధ్యకు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీతో జత కడతారనే..
తెలుగుదేశం, జనసేనతో బీజేపీ జత కడుతుందనే అనుమానం జగన్ లో పెరుగుతోంది. దీంతో అయోధ్యకు వెళ్లడానికి నిరాకరించారని తెలుస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే పరిణామాలు మారిపోతాయని ఆలోచిస్తున్నారు. దీంతో బీజేపీతో దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నారు. అందుకే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపనకు వెళ్లలేదనే వాదనలు వస్తున్నాయి.
క్రిస్టియన్ కావడంతోనే..
బీజేపీతో టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఒంటరి అవుతుంది. వైసీపీకి క్రిస్టియన్, మైనార్టీ ఓట్లే ఎక్కువగా ఉన్నందున అయోధ్యకు జగన్ వెళితే క్రిస్టియన్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయనే ఉద్దేశంతోనే జగన్ వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఓటు బ్యాంకు కోసమే తన మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఒక క్రిస్టియన్ వాళ్లే ఓట్లు వేస్తే గెలిచారా? హిందువులు వేయలేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మత సామరస్యం ఎక్కడ?
రాజకీయమంటే ఏ మతానికి కులానికో సంబంధించి కాదు. సర్వ మానవుల సేవయే రాజకీయం. ఇలా ఒక మతం కోసం రాజకీయం చేసే వారు రాణించలేరు. ఇప్పుడు ఏపీలో జగన్ పరిస్థితి కూడా అదే. తన విజయం అంత సులభం కాదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తే ముప్పువస్తుందని ఆయనకు తెలియదా అని వ్యాఖ్యానిస్తున్నారు.