Contest For World Records : అలుపెరుగని యోధుడు… గిన్నిస్ బుస్ రికార్డు కోసం ఎన్నికల్లో పోటీ
Contest For World Records : ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు పోటీ చేస్తే ఇంకొందరు గుర్తింపు కోసం, మరి కొందరు సమస్యల పరిష్కారం కోసం నామినేషన్లు వేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి కేవలం గిన్నిస్ రికార్డు కోసం ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తున్నాడు. ఈయన పేరు కే పద్మరాజన్. తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు ఆయనది. కేవలం ఇలా రికార్డే లక్ష్యంగా బరిలో నిలుస్తున్నాడు.
ఇక ఈయన నామినేషన్లు వేసే ప్రతిచోటు పెద్ద పెద్ద వారు పోటీచేసే నియోజకవర్గాలే టార్గెట్ కావడం విశేషం. అయితే ఇఫ్పటివరకు ఇలా నామినేషన్ల ఖర్చుకే మొత్తంగా రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది. అయితే తన ప్రాంతంలోనే టైర్ల దుకాణం నిర్వహిస్తున్న ఈ వ్యక్తి మొదటిసారిగా 1988లో పోటీలో నిలిచినట్లు తెలుస్తున్నది. అయితే పద్మరాజన్ తన చిన్నతనంలో 8వ తరగతి చదివాడు. ఇటీవల అన్నామలై ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీలో చేరాడు.
అయితే పద్మరాజన్ ఇప్పటివరకు 237 నామినేషన్లు వేసినట్లు తెలుస్తున్నది. అయితే ఇందులో ఎక్కువగా తిరస్కరించినవే ఉన్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లోనూ ఆయన నామినేషన్ వేశారు. అయితే దానిని అధికారులు తిరస్కరించారు. గతంలో ఈయన వాజ్ పేయి, కరుణానిధి, రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలిత లాంటి వారిపై కూడా పోటి చేశాడు. ఇక రాష్ర్ట పతి ఎన్నికల్లోనూ ప్రణబ్, ప్రతిభా పాటిల్, అబుల్ కలాం లాంటి వారిపై పోటీకి నామినేషన్ వేశారు. అయితే గతంలో నంద్యాల కు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని పీవీపై కూడా పోటీ కి పద్మరాజన్ నామినేషన్ వేశారు.