Lord Rama : రాముడు ఎప్పుడు జన్మించాడో తెలుసా?
Lord Rama : రామాయణం నిజమైతే అద్భుతం. అబద్ధమైతే మహాద్భుతం అన్నారో కవి. రామాయణంలో మనకు కావాల్సిన ఎన్నో అంశాలు కనిపిస్తాయి. తండ్రి జవదాటని కొడుకుగా శ్రీరాముడి విద్యుక్త ధర్మం ముచ్చటేస్తోంది. ఆదర్శపురుషుడుగా రాముడి ధర్మ పరివర్తన మానవులకు స్ఫూర్తిదాయకం. రాముడి ధర్మమార్గమే అతడిని కష్టాలు పెట్టింది. అయినా ఎక్కడ కూడా ధర్మం వదలక తన విధులు నిర్వహించి నీతికే పట్టం కట్టాడు.
అలాంటి రాముడి పుట్టుక కూడా ఓ కారణభూతంగానే జరిగింది. తన దశావతారాల్లో రాముడి అవతారం ఏడవది. శ్రీ మహావిష్ణువు ధర్మ రక్ష పరిరక్షణలో అవతారాలు ఎత్తుతూనే ఉంటాడు. అందులో భాగంగానే మానవ రూపాన్ని ధరించి ధర్మానికి కంకణబద్ధుడిగా నిలిచాడు. మనుషులకు ఆదర్శప్రాయుడిగా మారాడు. తన జన్మకు సార్థకత సాధించాడు.
రాముడు క్రీస్తు పూర్వం 5114 జనవరి 10న మధ్యాహ్నం 12.05 గంటలకు జన్మించాడని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఆర్యులు భారతీయులే అని తెలియజేసింది. హనుమంతుడు అశోక వనంలో సీతను కలిసిన రోజు 5976 బీసీ సెప్టెంబర్ 13 అని చెప్పింది. పాండవులు భారతంలో జూదంలో ఓడింది బీసీ 3153 గా నిర్ధారించింది. మహాభారత యుద్ధం 3139 బీసీలో అక్టోబర్ 13న ప్రారంభమైందని సూచించింది.
రామాయణం కల్పితం కాదని నిజంగానే జరిగిందని చెబుతున్నారు. ఇదో చారిత్రక నేపథ్యంలో జరిగిన సంఘటనగా అభివర్ణిస్తోంది. త్రేతాయుగంలో జరిగిన ఈ అద్భుత కావ్యం మానవులకు ఎంతో ఆదర్శంగా ఉంటుంది. రామాయణంలో మనకు కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని మనం పాటిస్తే మన జీవితం కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలుసుకోవడం మంచిది.