Sitara : ఇంస్టాగ్రామ్ లో మహేష్ బాబు కూతురు సంపాదన ఎంతో తెలిస్తే నోరేళ్ళాబేడుతారు!
Sitara Instagram Earnings : ఈమధ్య కాలంలో సినిమా ద్వారా సంపాదించే డబ్బులకంటే కూడా, సోషల్ మీడియా ద్వారా సంపాదించే డబ్బులు స్టార్ సెలబ్రిటీస్ కి ఎక్కువ అయిపోయింది. అత్యధికమైన రీచ్ వస్తే ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీస్ కి లక్షల్లో డబ్బులు ప్రతీ నెల వచ్చి పడుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా వ్యూస్ ద్వారా లక్షల రూపాయిలను సంపాదిస్తున్నారు సెలబ్రిటీస్.
సినీ సెలెబ్రిటీలు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలు కూడా ఇంస్టాగ్రామ్ వంటి మాధ్యమాలలో వచ్చి భారీ గా డబ్బులను సంపాదిస్తున్నారు. ఉదాహరణకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి మనం మాట్లాడుకోవాలి. ఈమె చిన్న తనం నుండే ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తుంది. వీటిలో ఇంస్టాగ్రామ్ లో ఈమెకి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఈమె పెట్టే ఫోటోలు, క్యూట్ వీడియోలకు సోషల్ మీడియా లో సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత రీచ్ సితార కి ఉంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈమె సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉండే పాటలకు డ్యాన్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చెయ్యడం ఇది వరకు మనం ఎన్నో చూసాము. అంతే కాకుండా తన అమ్మ, నాన్నలతో కలిసి ఉన్న ఫోటోలు, అలాగే తన స్నేహితులతో కలిసి ఆడుకునే వీడియోలు, కుకింగ్ ఇలా ఒక్కటా రెండా, సితార లో ఇంత టాలెంట్ ఉందా అని ఆమె ఇంస్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ ని చూస్తే కానీ అర్థం అవ్వదు. కేవలం మహేష్ బాబు కూతురు అవ్వడం వల్ల ఆమెకు అంత ఫాలోయింగ్ రాలేదు. తన సొంత టాలెంట్ తో తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందే ఇంత టాలెంట్ ని చూపిస్తే, ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో చూపిస్తుందో అని అభిమానులు మురిసిపోతున్నారు.
ఇది ఇలా ఉండగా ఈమెకి ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు 30 లక్షల రూపాయిలు ఆదాయం వస్తుందట. స్టార్ హీరోయిన్స్ కి కూడా ఇలాంటి ఆదాయమే ఉంటుంది. కానీ వాళ్ళు వివిధ భాషల్లో హీరోయిన్స్ గా నటించి తెచ్చుకున్న ఫేమ్ అది, కానీ సితార మాత్రం కేవలం ఒక సాధారణ సెలబ్రిటీ నెటిజెన్ గా ఈ రేంజ్ ఆదాయం ని సంపాదిస్తుంది. మొత్తం మీద యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమె నెలకు 60 లక్షల రూపాయలకు పైగానే డబ్బులు సంపాదిస్తుంది అట.