PM Modi : ఖుష్బూ అత్తగారి ఆశీర్వాదం తీసుకున్న మోదీ..ఫొటోలు వైరల్

Modi took the blessings of Khushboo's mother-in-law

Modi took the blessings of Khushboo’s mother-in-law

PM Modi : ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాది పర్యటనలో ఉన్నారు. గత నాలుగైదు  రోజులుగా ఏపీ, కేరళ, తమిళనాడుల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజులుగా తమిళనాడులోని పలు ఆలయాలు, రామేశ్వరం.. తదితర ప్రాంతాలను ఆయన సందర్శించారు. అలాగే పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలిశారు. సీనియర్ నటి ఖుష్బూ కూడా బీజేపీ నాయకురాలని తెలిసిందే.

మోదీ తమిళనాడుకు రాగానే ఖుష్బూ ఆయన్ను కలిసింది. ఈసందర్భంగా ఖుష్బూతో పాటు ఆమె అత్తగారు దేవనై చిదంబరం పిళ్లై కూడా ప్రధాని మోదీని కలిశారు. మోదీ ఖుష్బూ అత్తగారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం విశేషం. ఆవిడ మోదీని చసి చాలా సంతోషించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఖుష్బూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా సంతోషంగా ఓ పోస్ట్ చేసింది.

‘‘మోదీ గారికి అభిమాని అయిన మా అత్తగారు.. ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన ప్రదాని మోదీగారికి థ్యాంక్స్ చెప్పాలంటే మాటలు కూడా సరిపోవడం లేదు. మోదీగారిని ఒక్కసారైనా కలవాలి అనేది ఆమె లైఫ్ డ్రీం. వరల్డ్ పాపులర్ లీడర్ అయిన మన మోదీగారు..ఆవిడను చాలా సాదరంగా ఆహ్వానించారు. ఒక కొడుకు తల్లితో మాట్లాడినట్టు మాట్లాడారు. మా అత్తగారి వద్ద ఆశీర్వదం తీసుకున్నారు. మిమ్మల్ని కలవడం మర్చిపోలేనిది. మా అత్తయ్య కళ్లల్లో ఆనందం చూశాను.’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Kushboo Sundar (@khushsundar)

TAGS