Kodikathi Case : నా భర్తను పొలీసులే ఏదో చేశారు.. కోడి కత్తి కేసు లాయర్ సలీం భార్య ఆరోపణ..
Kodikathi Case : రాజకీయ లబ్ధి కోసం జగన్ కుట్ర పన్నారని ఆరోపిస్తూ కోడి కత్తి కేసులో సాక్ష్యం చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టు న్యాయవాది సలీం కోరారు. కోడికత్తి శ్రీను తరఫు న్యాయవాది సలీం గతంలో కేసులో మీడియా ఎదుట మాట్లాడారు.
ఐదేళ్లుగా శ్రీను జైలులోనే ఉంటున్నాడని, దళితులను జగన్ కించపరిచారని ఆరోపించారు. శ్రీను సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఎత్తిచూపుతూ శ్రీను కేసును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీను తల్లి సావిత్రమ్మ, దళిత సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు.
తక్షణమే కేసును రద్దు చేయకపోతే దళితుల నిరసనలు తప్పవని సలీం హెచ్చరించారు. న్యాయాన్ని అడ్డుకొని తన కుమారుడి జీవితాన్ని పాడుచేసేందుకే జగన్ కారణమంటూ మానసికంగా కుంగిపోయిన సావిత్రమ్మ తన కుమారుడిని విడుదల చేయాలని వేడుకుంది.
ఈ నేపథ్యంలో కోడి కత్తి శ్రీను తరుఫు న్యాయవాది సలీం అదృశ్యం అయ్యాడు. ఆందోళన చెందిన ఆయన భార్య, కుమారుడు తాడేపల్లి మీడియాతో మాట్లాడారు. తన భర్త రెండు రోజుల నుంచి కనిపించడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని నా భర్త మిత్రుడు హైకోర్టు లాయర్ శ్రీనివాస్ కు వివరించామని తెలిపారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యిందని తెలిపారు. కోడి కత్తి కేసు స్వీకరించిన దగ్గర నుంచి పోలీసులతో బెదిరింపులు వస్తున్నాయని, పోలీసులే నా భర్తను ఏదో చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.