Congress Ministers : బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలు
Congress Ministers : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజాపాలన కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఆరు గ్యారంటీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు తీసుకుని దాని ప్రక్రియ కొనసాగించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆర్థిక సాధ్యాసాధ్యాలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీపై గులాబీ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ రెడీగా ఉంది.
బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుల వల్ల ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. రూపాయి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నిర్వహించడం కష్టమే. ప్రజాపంపిణీ వ్యవస్థను గత ప్రభుత్వ అప్పులు దెబ్బ తీశాయి. క్రిష్ణా నది నుంచి ఏపీ అదనంగా నీరు తీసుకున్నా స్పందించలేదు. గులాబీ పార్టీని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ మంత్రులు విమర్శలు చేస్తున్నారు.
అన్ని శాఖల్లో అప్పులు ఎడాపెడా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో ఇప్పుడు గులాబీ పార్టీ నేతలపై మంత్రులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. క్రిష్ణా నదీ జలాలపై సర్కారు తీరుపై తప్పుబడుతున్నారు. గత ప్రభుత్వ తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గులాబీ పార్టీపై ముప్పేట దాడి చేస్తున్నారు. గత సర్కారు చేసిన తప్పులు గుదిబండగా మారాయి.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన పొరపాట్లు ఇప్పటికి కూడా బాధిస్తున్నాయి. వారు చేసిన తప్పిదాలను సరి చేయడానికే వీరికి కాలం గడిచిపోతోంది. దీంతో బీఆర్ఎస్ విధానాల తీరు ఎలా ఉంటుందో చూడండని మంత్రులు తమ అక్కసు వెల్లగక్కుతున్నారు. గత పాలకుల విధానాలే మాకు ప్రతిబంధకాలుగా మారాయని మొత్తుకుంటున్నారు.