Sania Mirza Husband : సానియా మీర్జాకు షాక్..  మరో పెళ్లి చేసుకున్న ఆమె భర్త

 

Sania Mirza Husband

Sania Mirza Husband Another Marriage

Sania Mirza Husband : దేశంలో ఆటకు గ్లామర్ తెచ్చిన తొలి క్రీడాకారిణి సానియా మీర్జా అనే చెప్పాలి. ఆమె క్రీడల్లోకి అడుగుపెట్టేముందు దాక  క్రీడాకారిణులకు మీడియాలో పెద్దగా ప్రాచుర్యం లభించేది కాదు.. చిరుప్రాయంలోనే టెన్నిస్ లో అడుగుపెట్టి..  అంచెలంచెలుగా ఎదిగింది. ఆట, అందంతో ప్రపంచ మీడియాను సైతం సానియా ఆకట్టుకుంది. దీంతో ఆమెకు దేశ, విదేశాల్లోనూ ఫ్యాన్స్ తయారయ్యారు. ఇక దేశంలో అప్పట్లో సానియా అంటే సంచలనం. కుర్రకారుకు నిద్ర లేకుండా చేసేది. ఇక ఆమె కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ క్రికెటర్  షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని.. భారత్ లోని తన అభిమానుల గుండెలను బరువెక్కి పోయేలా చేసింది.

సానియా మీర్జాకు ఇవాళ పెద్ద షాక్ తగిలింది. ఆమె భర్త షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారు. నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. సానియా-షోయబ్ విడాకుల గురించి గత కొంత కాలం నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షోయబ్ మరో పెళ్లి చేసుకోవడం గమనార్హం.

ఈక్రమంలో రెండు రోజుల కింద విడాకులు అనేది చాలా కష్టమంటూ సానియా సోషల్ మీడియాలో  చాలా ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు. అది వైరల్ గా మారిన తరుణంలో షోయబ్ మరో వివాహం గురించి నేడు ప్రకటన చేశారు. ఆయనకు ఇది మూడో పెళ్లి. 2010లో అయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ ..అదే ఏడాది సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఓ బాబు పుట్టాడు. ఇక సనా జావేద్ కు కూడా ఇంతకు ముందే వివాహం జరిగింది. 2020లో పాక్ కు చెందిన సింగర్ ను పెళ్లి చేసుకుని 2023లో అతడితో విడిపోయింది. తాజాగా షోయబ్ ను పెళ్లి చేసుకుంది.

TAGS