Bigg Boss : బిగ్ బాస్ హౌస్ లో శృంగారం.. బెడ్ రూం, బాత్రూంలో.. శివన్న షాకింగ్ కామెంట్స్
Bigg Boss : తెలుగు నాట బిగ్ బాస్ షోకు ఎంతో ఆదరణ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక మొన్నటి తెలుగు బిగ్ బాస్ షో హిందీ బిగ్ బాస్ కన్నా ఎక్కువ రేటింగ్ తో దూసుకెళ్లి నంబర్ వన్ షో గా నిలిచింది.
తెలుగు సినీ నటుడు శివాజీ కూడా మొన్నటి బిగ్ బాస్ లో టైటిల్ ఫేవరేట్ గా దిగిన మూడో స్థానం దగ్గరే ఆగిపోయాడు. కాకపోతే ఆయన టీం టాప్ ఫైవ్ లో ఉండడం విశేషం. ఇక ప్రశాంత్ విన్నర్ గా మారడానికి శివాజీ వేసిన ఎత్తుగడలే కారణమని చెప్పవచ్చు. యావర్ ను, ప్రశాంత్ ను కంట్రోల్ చేస్తూ.. ఓ రకంగా చెప్పాలంటే శివాజీ వల్లే ఈ షో అంతగా సక్సెస్ అయ్యిందనే వారు కూడా ఉంటారు.
ఇక ఆయన షోకు వెళ్లకముందే 90’ఎస్ మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించాడు. ఆయన షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ‘ఈటీవీ విన్’ లో అది ప్రసారమైంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీలో సంచలనం నమోదు చేస్తోంది. బిగ్ బాస్, 90ఎస్ తర్వాత కొత్త శివాజీ కనపడుతున్నాడనే చెప్పాలి. ఆయనకు ఇది ఓ రకంగా సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఇంతటి సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్న శివాజీ గత నెల రోజులుగా వందలాది ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు.
అందులో ఓ ఆసక్తికర ప్రశ్న ఆయన ముందుకొచ్చింది..అదెంటంటే.. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ శృంగార కోరికలు రావా? వస్తే ఏం చేస్తారు? అని. దీనికి శివాజీ స్పందిస్తూ ‘బిగ్ బాస్ హౌస్ లో 15 వారాల పాటు ఉంటారు. వాళ్లకు ఫీలింగ్స్ వస్తాయా? లేదా? అన్నదానిపై చాలా మందికి డౌట్ ఉంది. దీనిపై నేను కచ్చితంగా చెప్పాలి. అసలు హౌస్ లో ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ రావు. గేమ్ లో ఎలా నెగ్గుకు రావాలి అన్న ఆలోచనలు మాత్రమే వస్తాయి తప్ప సెక్సువల్ ఫీలింగ్స్ కలుగవు.’ అని చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ చోట కెమెరాలు ఉంటాయి. బెడ్రూంలో, బాత్రూం బయట కూడా ఉంటాయి. ఒక కంటెస్టెంట్ బాత్రూంలోకి వెళ్లే వరకూ ప్రతీది కనిపిస్తుంది. కాబట్టి ఎవరికీ కోరికలు, ఆలోచనలు రావు. అందరూ ఆటోమెటిక్ గా గేమ్ పైనే దృష్టి పెడుతారు.