Samantha : నాగ చైతన్య ని నమ్మి నా ఇష్టాలను కూడా కోల్పోయాను అంటూ సమంత కన్నీళ్లు!

Samantha

Samantha

Samantha : సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట నాగ చైతన్య మరియు సమంత జంట. ఈ ఇద్దరు కలిసి ఉన్నంత కాలం మేడ్ ఫర్ ఈచ్ లాగా అనిపించారు. కానీ ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుండి ఈ ఇద్దరికీ సోషల్ మీడియా లో ఏర్పడిన నెగటివిటీ మామూలుది కాదు. సమంత కి సపోర్టుగా నిలిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నాగ చైతన్య కి సపోర్టుగా నిల్చేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు.

ఇకపోతే సమంత ఇటీవలే వాట్సాప్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ ఆమె ఇంస్టాగ్రామ్ కమ్యూనిటీ లో అప్లోడ్ చేసిన కొన్ని స్టేటస్ లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వీటి ద్వారా ఆమె తొలిసారి నాగ చైతన్య వల్ల తానూ ఎదురుకున్న సమస్యలను చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడిందో ఒకసారి విందాము.

ఆమె మాట్లాడుతూ ‘జీవితం లో నేను చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉందా అంటే నా సొంత ఇష్టాలు, అయిష్టాలను అర్థం చేసుకోలేక పోవడం. ఎందుకంటే ఆ సమయం లో నేను నా జీవిత భాగస్వామి నాగ చైతన్య వల్ల ఎంతో ప్రభావితం అయ్యాను. అయితే కష్ట సమయం వచ్చినప్పుడే నాకు అర్థం అయ్యింది. నేను నేర్చుకోవాల్సిన విలువైన గుణపాఠం ఇంకా ఉంది అని. నా ఎదుగుదలకు అవసరమైనది తెలుసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చాలా కాలం తర్వాత ఆమె నాగ చైతన్య గురించి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే మయోసిటిస్ వ్యాదికి అమెరికా లో ట్రీట్మెంట్ చేయించుకున్న సమంత కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటుంది.

గత ఏడాది ఖుషి సినిమాతో మన ముందుకు వచ్చిన సమంత అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతుంది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా, నటన కి ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ రోల్స్ తో పాటుగా అప్పుడప్పుడు విలన్ రోల్స్ తో కూడా అలరిస్తూ విలక్షణ నటిగా సమంత మంచి పేరు తెచ్చుకుంది.

TAGS