Guntur Kaaram : అందరూ వదిలేశారు..ఫ్యాన్సే లేపుతున్నారు..
Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సంక్రాంతి బరిలో విజేతగా నిలిచేది తమ చిత్రమే అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మూవీ యూనిట్. అందుకే ఎలాంటి ప్రమోషన్ వర్క్ కూడా చేయలేదు. ఓన్లీ గుంటూరులో ప్రిరిలీజ్ వేడుకను మాత్రం గ్రాండ్ గా చేశారు. అయినా కూడా మహేశ్ బాబు- త్రివిక్రమ్ మూవీ కాబట్టి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. స్పెషల్షోలు పడ్డాయి.. టికెట్ ధరలు పెంచారు. అయితే తొలి ఆట అయ్యిందో లేదో నెగిటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. ఇక అటు వైపు హనుమాన్ కు సరిగ్గా థియేటర్లు లేకున్నా.. చూసినా కొందరు బ్లాక్ బస్టర్ అనేశారు. మౌత్ టాక్ తో ఆ సినిమా దూసుకెళ్తోంది అది వేరే విషయం..
ఇక ఇక్కడ మహేశ్ బాబు సినిమాకు ఇలా నెగిటివ్ టాక్ రావడంతో.. రెండో ఆట నుంచే ఆ ప్రభావం పడింది. అయినా సినిమా చెత్త అయితే కాదుగానీ.. ఒకసారి చూసే సినిమా. రోటిన్ కథే కావడంతో ఫ్యాన్స్ కు తప్ప మిగతా జనాలు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. ఎందుకంటే అవతల సినిమాలు ఓ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి..
ఈ సినిమా విడుదల తర్వాతైన నిర్మాత నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, తమన్ , రమ్యకృష్ణ లాంటి వాళ్లు వచ్చి ఇంటర్వ్యూలు గట్రా చేసి ఉంటే..ఇంకొంచెం బెటర్ గానే ఉండేది. ఒక్క మహేశ్ బాబే సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇలా అందరూ కలిసి సినిమాపై కొంచెం బజ్ క్రియేట్ చేస్తూ.. సినిమా కథ పాతదే అయినప్పటికీ మహేశ్ నటన అద్భుతం.. ఆయన ఎలివేషన్స్, డైలాగ్స్, సాంగ్స్, డ్యాన్స్..అంటూ జనాల్లో ఆసక్తిని పెంచేస్తే నెగిటివ్ టాక్ తగ్గేది. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
ఇక మహేశ్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రమే సినిమాను కొంచెం పికప్ చేస్తున్నారు. పలు సర్వేల్లో సినిమా బాగుందని, థియేటర్ల ఫుల్ వంటి వీడియోలు చూపి పాజిటివ్ టాక్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా విడుదలై రేపటికి వారం కాబోతుంది. సెకండ్ వీక్ నడవాలంటే నిర్మాత, మిగతా టీం పూనుకోవాల్సిందే. లేకుంటే సినిమా కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.