INDIAN 2 : థియేటర్స్ లో కంటే ముందుగా ఓటీటీ లోకి ‘ఇండియన్ 2’..శంకర్ కి బుర్ర పనిచెయ్యడం లేదా!

'Indian 2' in OTT earlier than in theatres

‘Indian 2’ in OTT earlier than in theatres

INDIAN 2 : సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఇండియన్’ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో తెలుగు లో ‘భారతీయుడు’ అనే పేరు తో విడుదలై ఇక్కడ కూడా భారీ హిట్ గా నిల్చింది. కమల్ హాసన్ మార్కెట్ ని మన టాలీవుడ్ లో పదింతలు అయ్యేలా చేసింది. ఈ సినిమాకి ఇన్నాళ్లకు ఇప్పుడు సీక్వెల్ గా ‘ఇండియన్ 2 ‘ అనే చిత్రం చేస్తున్నాడు శంకర్.

ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత శంకర్ రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా మధ్యలో మళ్ళీ ‘ఇండియన్ 2’ ని మొదలు పెట్టాల్సి వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దాదాపుగా చివరిదశకు చేరుకుంది. ఏప్రిల్ నెలలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు సుమారుగా వంద కోట్ల రూపాయిల ఫ్యాన్సీ రేట్ కి ఇండియన్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అన్నీ భాషలకు కొనుగోలు చేసిందట. అయితే మేకర్స్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టబోతున్నారట. అంటే కొత్త సినిమాలను టికెట్ రేట్ పెట్టి ఇంట్లోనే చూసే సిస్టం అన్నమాట. కేవలం నాలుగు గంటలు మాత్రమే ఫస్ట్ డే ఫస్ట్ షో ఫీచర్ లో ఈ సినిమాని చూసే అవకాశం ఉంటుంది.

తర్వాత నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ నుండి తొలగిస్తారట. దీనికి మేకర్స్ ఒప్పుకుంటే మరో వంద కోట్ల రూపాయిలు అదనంగా ఇవ్వడానికి సిద్ధం గా ఉందట నెట్ ఫ్లిక్స్ సంస్థ. అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తారట. అయితే ఈ ఫీచర్ వల్ల పైరసీ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేకర్స్ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తుంది. కానీ ఏ సాఫ్ట్ వేర్ కూడా పైరసీ చెయ్యలేని ఫీచర్ తో దీనిని రూపొందించామని, పైరసీ జరగకుండా చూసే బాధ్యత మాది అంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు హామీ ఇచ్చారట, దీనికి మేకర్స్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

TAGS