CM Jagan Invitation : షర్మిల కొడుకు నిశ్చితార్థానికి సీఎం జగన్.. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక..

CM Jagan Invitation

CM Jagan Invitation

CM Jagan invitation : ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తన కుమారుడు పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.  ఈనెల 18న హైదరాబాద్ లో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిశ్చితార్థంతో పాటు పెళ్లికి రావాలని పార్టీలకు అతీతంగా షర్మిల అందరినీ ఆహ్వానించారు. తాజాగా  ఎంగేజ్ మెంట్, వివాహ ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది.

వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం ఫిబ్రవరి 17న జరుగనుంది. ఈనెల 18న  ఎంగేజ్ మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను షర్మిల ఇప్పటికే అందించారు. తన జగన్ తో పాటు చంద్రబాబు, రేవంత్, హరీశ్ రావు, కేటీఆర్.. ఇలా దాదాపు అందరినీ ఆహ్వానించారు.

ఈ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో జరుగనుంది. ఎంగేజ్ మెంట్ కు జగన్ తో పాటు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానం పంపడంతో..వారంతా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు తరఫున లోకేశ్ ఎంగేజ్ మెంట్ కు రానున్నారని తెలుస్తోంది.

కాగా, ఫిబ్రవరి 17న జోధ్ పూర్ లో రాజా రెడ్డి-ప్రియ వివాహం జరుగనుంది. ఆతర్వాత ఫిబ్రవరి 24న శంషాబాద్ లోని పోర్ట్ గ్రాండ్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వైఎస్ మరణం తర్వాత తొలి శుభకార్యం ఇదే కావడంతో ఆ ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. ఎన్నికల వేళ కావడంతో ఈ పెళ్లి వేడుకపై రాజకీయంగానూ ఆసక్తిని పెంచుతోంది.

TAGS