AP Collector Shocked CM Jagan : సీఎం జగన్ కు షాకిచ్చిన ఏపీ కలెక్టర్..
AP Collector Shocked CM Jagan : ఏపీలో వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలన అంతా ఆ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిందనే టాక్ వినిపిస్తున్నది. అధికారుల వ్యవస్థ నామమాత్రంగా తయారైంది. దీనిని ప్రశ్నించిన వారిపై వేధింపులు, బెదిరింపులు, కేసులు పెట్టడం లాంటివి చేసి నయానో భయానో దారికి తెచ్చుకుంటున్నారనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇక ప్రతిపక్ష పార్టీలపై వరుస కేసులతో సతమతం చేస్తున్నారు.
అయితే తాజాగా వైసీపీ ’వై ఏపీ నీడ్స్ జగన్‘ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నది. ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ సర్కారు ఈ కార్యక్రమం చేపట్టింది. ఏపీలో మరోసారి జగన్ ఎందుకు రావాలో చెబుతూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే పూర్తిగా పార్టీ కార్యక్రమంలో ఇప్పుడు అధికారులు కూడా పూర్తిస్థాయిలో వివాదాస్పదమవుతున్నది. దీనిపై ఏ ఒక్క ఉన్నతాధికారి కూడా స్పందించకపోవడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలంటే ఎంత భయం ఉందో తెలియజేస్తున్నదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
అయితే తాజాగా కోస్తా జిల్లాకు చెందిన ఓ కలెక్టర్ దీనిపై ఘాటుగా స్పందించారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ బోర్డుల ఏర్పాటు కార్యక్రమంలో మాత్రమే అధికారులు పాల్గొనాలని ఆర్డర్స్ ఇచ్చారు. కొందరు అధికారులు పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిని ఆక్షేపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే అధికారులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, కేవలం వలంటీర్ల వరకే ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీనిపై మిగతా జిల్లాల అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనకూడదని రూల్స్ ఉన్నా, ఇలా నేరుగానే పాల్గొనడం ఏంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సదరు కలెక్టర్ ఇఛ్చిన ఆర్డర్స్ విషయంలో హర్షం వ్యక్తం చేశాయి.