Animal : ‘ఎనిమల్’ నిర్మాతలకు ఢిల్లీ హై కోర్ట్ షాక్..OTT విడుదల ఇక లేనట్టేనా?
Animal OTT : గత ఏడాది సందీప్ వంగ దర్శకత్వం లో రణబీర్ కపూర్ హీరో గా నటించిన ‘ఎనిమల్’ చిత్రం విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కేవలం తెలుగు వెర్షన్ నుండే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా వసూలు చేసి ఉండేది కానీ, ‘సలార్’ మరియు ‘డుంకీ’ చిత్రాల కారణంగా థియేట్రికల్ రన్ ఆగిపోయింది.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు తో పాటుగా ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీ స్ట్రీమింగ్ కి స్టే ని కోరుతూ సినీ వన్ సంస్థ హై కోర్టు ని ఆశ్రయించింది. విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లో 35 శాతం కి పైగా మా సంస్థకి వచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాం, కానీ టీ సిరీస్ సంస్థ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు అంటూ కోర్ట్ లో పిటీషన్ ని దాఖా చేసారు. దీనిపై విచారణ జరిపిన హై కోర్టు టీ సిరీస్ సంస్థ అధినేత ని వివరణ కోరగా ‘ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు 2.2 కోట్ల రూపాయలకు సినీ వన్ సంస్థ హక్కులను వదులుకుంది. దానికి సంబంధించిన ఒప్పంద పత్రం ఇదే’ అంటూ కోర్టు ముందు ఆధారాలను సబ్మిట్ చేశారు.
అది పరిశీలించిన తర్వాత హై కోర్టు సినీ వన్ ని మందలిస్తూ ‘ఈ ఒప్పందం గురించి మా వద్ద ఎందుకు దాచి పెట్టారు?, దీనికి వివరణ ఇవ్వాలి’ అంటూ సినీ వన్ సంస్థ ని ఆదేశించింది. ఈ నెల 18 వ తారీఖున ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభం కానుంది. తుది తీర్పు ఇచ్చే వరకు స్ట్రీమింగ్ చేసేందుకు వీలు లేదని కోర్టు చెప్పడం తో ఈ సినిమా జనవరి 26 వ తేదీన టెలికాస్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.